Posts

మొగిలిపేట లో పీరీల పండగ సందడి

Image
తెలంగాణ లో ఊరంతా కలిసి ఉల్లాసంగా జరుపుకునే పండుగలలో పీరీల పండుగ ఒకటి. మసీదు ముందు రాత్రిళ్ళు చేరి పూతల గంగన్న పాట ఎత్తుకుంటే మిగతావారంతా గుండం చుట్టూ ఆడుతూ పాడుతూ ఓ రాత్రి వరకూ ఊరంతా గడిపే సందడి అంతా ఇంతా కాదు. అదొక మధుర జ్ఞాపకం.

Whatsapp వాడుకలో గ్రామ యువత నిర్వహిస్తున్న సమూహాలు

Image
      గత ఐదారేళ్ళ లో విస్తృతంగా అంతర్జాలం గ్రామీణ భారతానికి అందుబాటులోకి రావడం తో యువజనం వారి వారి గ్రామాల వికాసం మంచి చెడ్డలు సమస్యలు పరిష్కారాలను చాలా బాగా చర్చిస్తున్నారు. అలా మా గ్రామం యువత దేశ  ఎల్లలు దాటి విదేశాల్లో ఉన్న ఎంతో మందిని అనుసంధానం చేస్తూ చక్కగా సమూహాన్ని నిర్వహిస్తోంది. వారికి అభినంనదనలు. సమూహాల పేర్లు : 1. మా ఊరు మా మొగిలిపేట 2. మొగిలిపేట ప్రజావాణి

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం - గ్రామస్థుల్లో నూతనోత్సాహం

Image
కార్యక్రమ వివరాలు   స్వస్తి శ్రీ విజయనామ సంవత్సర మాఘ బహుళ విదియ రోజున ... తేది : 17/2/2014  సోమవారం నుండి 20/2/2014 వరకు కార్యక్రమం జరిగింది. శాశ్వత ఆలయ ధర్మ కర్త గా శ్రీమాన్ శ్రీ కల్వకుంట్ల రాజేశ్వర్ రావు గారు మరియు శ్రీమతి కల్వకుంట్ల సరళ దేవి గారు ముందుండి కార్యక్రమ నిర్వహణ గావించారు . గ్రామ స్థాయి లో గ్రామ అభివృద్ధి కమిటి , గ్రామ దేవాలయ కమిటి మరియు భక్తులు ప్రజలు కలిసి దిగ్విజయం గావించారు. 17/2/2014 రోజు సోమవారం రోజు ... ఉదయం 9.15 గంటలకు ప్రతిష్టా మూర్తుల శోభాయాత్ర గ్రామ వీధుల్లో బ్రహ్మాండంగా జరిగింది. మాతలు భక్తులు మంగళహారతులతో ఎదురెల్లి స్వాగతం పలికారు. అనంతరం 11 గంటలకు స్వస్తి పుణ్య వచనం రక్షాబంధన దీపారాధన , ఆచార్య రుత్విక్కరణం జరిగాయి. మంటపారాధన, కుంభ స్థాపనము తరువాత తీర్థ ప్రసాద వినియోగం తో మొదటి రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసాయి.  18/2/2014 తదియ మంగళ వారం రోజు .... ఉదయం 6 గంటలకు సుప్రభాతము 9 గంటలకు గత స్థాపిత దేవతార్చన దివ్య ప్రభంద పారాయణం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది. మంటపారాధన, అగ్ని ప్రతిష్ట , నిత్య హోమము , స్థాపిత దేవత హోమాలు ,

మొగిలిపేట లో నూతనంగా ఏర్పడిన విద్యుత్ సబ్ స్టేషన్

Image
ఖానాపూర్ తోవ లో సబ్ స్టేషన్ ప్రాంగణం . ప్రవేశ ద్వారము .

మొగిలిపేట గ్రామం లో శుద్ధ జల పరిశ్రమతో ఉపాది పొందుతున్న యువకులు.

Image
మన గ్రామం లో ఇదివరలో శుద్దజల కేంద్రం లేకుండేది ... కాని రెండేళ్ళ క్రితం మన గ్రామం లోని కొందరు యువకులు దీనిని ప్రారంభించి ఉపాదిని పొందుతున్నారు . సంతోషం. పాత గ్రామ పంచాయతి భవనం లో కేంద్రం మరియు నిర్వాహకుడు గొల్లవత్తుల విజయ్ . రవాణ కోసం సిద్దం గా ఉన్న వాహనం .

మల్లపూర్ మండలం లో మొదటి బ్యాంక్ - సిండికేట్ బ్యాంక్ మొగిలిపేట

Image
                             1981 ప్రాంతం లో మన గ్రామాలను దొరలు పరిపాలిస్తున్న రోజుల్లో మన గ్రామం లో ఫోన్ సౌకర్యం అలాగే బ్యాంక్ సౌకర్యం ఉన్నాయి . ఆనాటి గ్రామ పెద్దలు చాలా శ్రమించి మన గ్రామానికి బ్యాంక్ ను మంజూరి చేయించారు . ఇప్పటికీ చుట్టుపక్కల పది గ్రామాలకు మన బ్యాంక్ సీవలు అందిస్తున్నది .               తొలుత పెద్దబాపు శ్రీ రాజేశ్వర్ రావ్ ఇంట్లో మన బ్యాంక్ ఉండేది . మూడు దశాబ్దాల పాటు అదే భవనం నుండి సేవలు అందించింది . అనంతరం నేడు బస్టాండ్ సమీపం లో గల భవనం లోనికి మార్చబడింది . పై  రెండు  ఫోటోల్లో కనబడుతున్నవి పాత భవంతి లోని బ్యాంక్ చిత్రాలు .   ఈ పై రెండు చిత్రాల్లో కనిపిస్తున్నవి నూతన భవంతి లోనికి మారిన బ్యాంక్ చిత్రాలు .

పసుపు రైతులు పసుపును ఉడకబెట్టే పనిలో ఉన్నారు ... కాని పసుపు మద్దతు ధరలు పాతాళం లో ఉన్నాయి . ఘోరం .

Image
గత సంవత్సరం తో పోల్చినపుడు పసుపు రైతు తీవ్రమైన దిగాలు తో ఉన్నాడు . ఎందుకంటే గతం లో క్వింటాలు  రూ .15000 వరకు పలికిన మద్దతు ధర నేడు రూ. 5000 లకు పడిపోయింది. అతని శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు . ప్రభుత్వం దీని విషయం ఆలోచించాలి .   పసుపు  ఉడకబెట్టే యంత్రం  పసుపు రైతులు