Posts

మొగిలిపేట స్కూల్ లో బాలురకు వాలీబాల్ పోటీలు

Image
     మన మొగిలిపేట పాటశాల లో గత 15 వ ఆగస్ట్ సందర్భంగా  పిల్లలకు వాలీబాల్ పోటీలు జరిగాయి . ప్రారంభిస్తున్న హెడ్ మాస్టర్  శ్రీ గోవర్ధన్ గారు ..మరియు చిత్రం లో జనార్ధన్ , లచ్చుము , శర్మ గార్లు వున్నారు. సూచనలిస్తున్న శర్మ గారు ..! ఛలో మారో ...!

మొగిలిపేట స్కూల్ లో బాలబాలికలకు కబడ్డీ పోటీలు .

Image
                              గత 15 ఆగస్ట్ కోసం మన మొగిలిపేట్ ప్రభుత్వ ఉన్నత పాటశాలలో ఆటల పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా బాల బాలికలకు "కబడ్డీ "  ఆట ఆడించారు. కబడ్డీ - కబడ్డీ : కబడ్డీ టీం లతో సిద్దంగా వున్న  సార్లు శర్మ - లచ్చుము -శ్రీకాంత్ -జనార్ధన్ గార్లు. బాలుర కబడ్డీ షురూ .......! ఆడిస్తున్న తోట లింగన్న గారు....! ఛలో ..పట్టేయరా ...పట్టే య్ ...!  కబాడీ ....కబాడీ ...! టీంలకు సూచనలిస్తూ ..రామ్మోహన్ గారు. వీక్షిస్తున్న విద్యార్థులు . బాలికల కబడ్డీ ..షురూ ...! సూచనలిస్తున్న అరుణ మాడం గారు...! ఆడించడానికి సౌమ్య గారు విజిల్ తో  సిద్దం. ఛలో ..ఖేల్ షురూ ..! కబాడీ ...కబాడీ ...! పట్టే య్ ..పాయింట్ ..కొట్టెయ్ ...! వీక్షిస్తున్న విద్యార్థులు ...!

"అప్లాని గుర్రాలు" .. ఈ సీజన్ లో అలా ఒకదాని పై ఒకటి గుంపుగా కదలడం విచిత్రమే !

ఇవండి అప్లాని గుర్రాలంటే .. అలా ఎంత దూరమైనా వాటి ప్రయాణం ఉమ్మడిగానే ...!

మట్టి గణపతి కి జై ...!

Image
                      ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ... తో నరకాన్ని అనుభవిస్తున్నాం . అందులో మరీ ఈ  POP విగ్రహాలతో ఎంత కలుషితమో చెప్పవలసిన అవసరం లేదు . నాటి రోజుల్లాగే మన ఇంట్లో మన పాటశాలల్లో మట్టి విగ్రహాల తయారి ప్రారంభిద్దాం ... పంచి పెడదాం ..రండి.                                 మట్టి విగ్రహాలు పంచుతున్న మా విద్యార్థులు. మట్టి గణపతి కి జై ! మా బ్లాగ్ సందర్శకులందరికి చవితి శుభాకాంక్షలు .  

మొగిలిపేట - ఓబ్లాపూర్ మధ్య మల్లెంపంపు వద్ద రోడ్డు కొట్టుకుపోతున్న దృశ్యాలు .

Image
                 మా గ్రామం క్రింద ఓబ్లాపూర్ వుంటుంది . వీటి మధ్య వున్న మల్లెంపంపు అనే చిన్న కాలువ మీది నుండి రహదారి ఆదిలాబాద్ - కరీంనగర్ జిల్లాలను కలుపుతుంది. ఆ రహదారి పూర్తిగా కొట్టుకు పోయింది. మొగిలిపేట చెరువు కట్ట తెగడం వలన వరద ఉదృతి వల్ల ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం జరిగింది. రాక పోకలు నిలిచి పోయాయి.

మొగిలిపేట చెరువు కట్ట తెగిన వీడియోలు - 1

కట్ట తెగిన మంగలి గండి వద్ద వెళ్లి పోతున్న నీరు ......!

మొగిలిపేట దాటి మల్లెంపంపు వద్ద వరదకు కొట్టుకుపోతున్న రోడ్డు వీడియో