Posts

వలసల తో గడిచిపోతున్న లంబాడీ ల జీవనం ... పిల్లలు విద్య కు దూరం .

Image
                                       మా ప్రాంతం లో చెరుకు  వాణిజ్యపంట గ రానించడం వల్ల రైతులు అధిక సంఖ్యలోనే చెరుకు పండిస్తారు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యం పేట లో చక్కెర  ఫ్యాక్టరీ ఉంది. సమీపం లోని ఎక్కడి రైతు లైనా ఇక్కడికే చెరుకును పంపిస్తారు.                                        ఐతే చేతికొచ్చిన పంటను ఈ సీజన్ లో కత్తిరించి ఫ్యాక్టరీ కి తరలించాల్సి ఉంటుంది.  ఇక్కడి రైతులకు చెరుకు నరకడం రాదు. దీని కోసం రైతులు ఆదిలాబాద్ జిల్లా , నిజామాబాద్ జిల్లా ల నుండి లంబాడీలను కుటుంబాలకు కుటుంబాలుగానే గుత్త కు మాట్లాడుకొని తెచ్చుకుంటారు. వారు ఎన్ని క్వింటాళ్ళు నరికారు అనే దాని మీదికేల్లి వాళ్లకు కూలీ కట్టిస్తారు.                                       ఈ విధముగా లంబాడీల ప్రత్యేక...

మొగిలిపేట స్కూల్ లో బాలల దినోత్సవం - పిల్లల స్వయం పరిపాలన కార్యక్రమం.

Image
                       మొగిలిపేట ఉన్నత పాఠశాల లో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన వేడుక నిర్వహించారు. పిల్లలు ఉదయాన్నే చక్కగా తయారై వచ్చి ఒక్క రోజు మాస్టారి గా ఎనలేని ఆనందాన్ని ఆస్వాదించారు. పండగ చేసుకున్నారు. బహుమతులు అందుకున్నారు. జీవితం లో ఒక తీపి జ్ఞాపకాన్ని నమోదు చేసుకొన్నారు. కార్యక్రమ దృశ్య మాలిక : పిల్ల టీచర్ల స్టాఫ్ రూం .

మా బడి నుండి... గిజిగాడి పిట్టగూల్ల దగ్గరికి వెళ్లి పాఠ్యాంశాన్ని ప్రత్యక్షంగా భోదిస్తున్న శర్మగారు.

Image
                           మొగిలిపేట పాటశాల లో కేవలం సైన్స్ లే గాక భాషా విషయాలను కూడా ప్రత్యక్ష  సందర్శన గావించి, పిల్లలకు చక్కటి విషయ అనుభవాన్ని ఇస్తున్నమహేశ్వర శర్మ గారి ప్రయత్నం అభినందనీయం. దీని వల్ల పిల్లల్లో ఉత్సాహం, ఉల్లాసం తో పాటు మరిచిపోని రీతి లో గుర్తుంచుకొనే అవకాశం లభిస్తుంది. ఇలా వారు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతీ వారాంతం లో ఏదేని కవి పరిచయం చేయడం జరుగుతోంది. చూడండి మా శర్మ గారి గిజిగాడి సందర్శన : అమ్మో  ఈ తుమ్మ కు ఎన్ని గూల్లో.... అంతా గిజిగాడి ఇంజనీరింగే మరి...! గుఱ్ఱం జాషువా గారి వర్ణన ను ప్రత్యక్షంగా పోల్చుకుంటున్న విద్యార్థులు . వివరణ లో లీనమైన శర్మ గారు. కేవలం గిజిగాడి గురించే కాదు, తుమ్మ చెట్ల వల్ల లాభం ... అలాగే తుమ్మ వల్ల పొలం కు మరియు రైతులకు గల లాభాలను వివరిస్తున్న శర్మ గారు. గోదావరి ఒడ్డున మా తెలుగు మాస్టారు..... శర్మ గారు.

విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచుతున్న మొగిలిపేట పాటశాల లోని వారాంత కార్యక్రమాలు.

Image
                             మొగిలిపేట పాటశాల లో గణితం సారు రామ్మోహన్ గారి ఆధ్వర్యం లో ప్రధానోపాద్యాయులు గోవర్ధన్ గారి సమక్షం లో  నియమితంగా  ప్రతి శనివారం విద్యార్థులలో జిజ్ఞాస, వ్యక్తిత్వ వికాసం ,భాషా జ్ఞానం, విజ్ఞాన విషయాలు, చిక్కు ప్రశ్నలు, పిల్లల నుండి సహజంగా నిత్యజీవితం లో అర్థం గాని ప్రశ్నల ను రాబట్టి  సమాధానాలతో కార్యక్రమమం యోజన చేసి అమలు చేయడం జరుగుతోంది. ఇది అత్యంత సహజంగా నిర్వహించడం విశేషం. పిల్లలు శనివారం ఎప్పుడొస్తుందా అనే రీతి లో సాగుతోంది. ఈ శనివారం విశేషాలు ( తేది : 23.10.2010 ) : పాటశాల ప్రాంగణం లో సమావేశమైన విద్యార్థులు. సి. నా . రె    కవి పరిచయం తో కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్న శర్మ గారు. ఆసక్తి గా వింటున్న విద్యార్థులు . ఉపాధ్యాయులు ...విద్యార్థులు . సైన్స్ సార్ జనార్ధన్ గారు  నీటి లో కొన్ని వస్తువులు మునుగుటకు, తేలుటకు గల కారణాలను కృత్యం ద్వారా తెలిపారు. అలాగే గణితం సార్  రాము గారు  సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడానికి గల ...

మొగిలిపేట పాటశాలలో పదవతరగతి పిల్లల తల్లిదండ్రుల తో ఉపాధ్యాయుల సమావేశం _ విశేషాలు.

Image
                         పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గోవర్ధన్ గారి ఆధ్వర్యం లో తేది : 25.10.2010 రోజున  పదవతరగతి పిల్లల తల్లి దండ్రుల తో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో పిల్లల ప్రగతి మరియు రాబోవు ssc పరీక్షల కోసం తల్లి దండ్రులు పిల్లల పట్ల  తీసుకోవలసిన జాగ్రత్తలు  గురించి చర్చించడం జరిగింది. విషయాలు : పిల్లల ప్రగతి పత్రాలను తల్లిదండ్రుల తో కలసి విశ్లేషించడం జరిగింది. పిల్లలను ప్రతీ రోజు ప్రాతః కాలముననే లేపి చదివించాలని కోరడమైనది. ప్రతీ ఉపాధ్యాయుడు తన subject  కు సంబంధించి విద్యార్ధి మెరుగు కోసం సూచనలను చేశారు. త్రైమాసిక ఫలితాల పై విశ్లేషణ జరిగింది ... అనువర్తి గా చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. పిల్లల లో చదువు తో పాటు సంస్కారాన్ని పెంపొందించుటకు తగు సూచనలను చేయడం జరిగింది. సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు. సమావేశాన్ని ప్రారంభిస్తున్న తరగతి ఉపాధ్యాయులు  శర్మ గారు. వేదిక పై ఆసీనులైన ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ గారు , గ్రామ ప్రముఖులు వెంకట్రెడ్డి గారు  , ssc  పరీక్షల ఇంచార్...

దుడ్డె తినడానికి లేలేత ఎనాద్రి మొక్కను మేత గా వేస్తారు .. దాని లేత చివురుకు సుతి మెత్తని మేత .

Image
పసి పాప గా ఈ లోకం లోకి వచ్చిన బర్రె ( గేదె ) పిల్ల దుడ్డె  కోసం వేసే గడ్డి మొక్క పేరే ఎనాద్రి .

అనవసర వర్షాలతో నానిపోతున్న మక్క కంకి .... దిక్కు తోచని రైతు.

Image
                                   ఇటీవలి అల్పపీడన వర్షాల వల్ల తోట్లో, మైదానాల్లో ఆరబెట్టేందుకు ఉంచిన మక్క కంకి నాని పోయింది. వర్షాలు వచ్చాయి అనే ఆనందం లో బీడు భూముల్ని కూడా సాగు లోకి తెచ్చిన రైతులకు నిరాషే మిగిలింది. మార్కెట్ లో ఏమాత్రం ధర పలకని కంకి ని ఏంచేయాలో అర్ధం గాక రైతులు దిగాలు పడుతున్నారు. మంచి దిగుబడి వచ్చిందన్న ఆనందం లేకుండా పోయింది...! ఆరుబైట కంకి కుప్పలు పోసిన రైతులు .... వర్షాల తో తడిసాయి.