Posts

మొగిలిపేట లో పీరీల పండగ సందడి

Image
తెలంగాణ లో ఊరంతా కలిసి ఉల్లాసంగా జరుపుకునే పండుగలలో పీరీల పండుగ ఒకటి. మసీదు ముందు రాత్రిళ్ళు చేరి పూతల గంగన్న పాట ఎత్తుకుంటే మిగతావారంతా గుండం చుట్టూ ఆడుతూ పాడుతూ ఓ రాత్రి వరకూ ఊరంతా గడిపే సందడి అంతా ఇంతా కాదు. అదొక మధుర జ్ఞాపకం.

Whatsapp వాడుకలో గ్రామ యువత నిర్వహిస్తున్న సమూహాలు

Image
      గత ఐదారేళ్ళ లో విస్తృతంగా అంతర్జాలం గ్రామీణ భారతానికి అందుబాటులోకి రావడం తో యువజనం వారి వారి గ్రామాల వికాసం మంచి చెడ్డలు సమస్యలు పరిష్కారాలను చాలా బాగా చర్చ...

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం - గ్రామస్థుల్లో నూతనోత్సాహం

Image
కార్యక్రమ వివరాలు   స్వస్తి శ్రీ విజయనామ సంవత్సర మాఘ బహుళ విదియ రోజున ... తేది : 17/2/2014  సోమవారం నుండి 20/2/2014 వరకు కార్యక్రమం జరిగింది. శాశ్వత ఆలయ ధర్మ కర్త గా శ్రీమాన్ శ్రీ కల్వకుంట్ల రాజేశ్వర్ రావు గారు మరియు శ్రీమతి కల్వకుంట్ల సరళ దేవి గారు ముందుండి కార్యక్రమ నిర్వహణ గావించారు . గ్రామ స్థాయి లో గ్రామ అభివృద్ధి కమిటి , గ్రామ దేవాలయ కమిటి మరియు భక్తులు ప్రజలు కలిసి దిగ్విజయం గావించారు. 17/2/2014 రోజు సోమవారం రోజు ... ఉదయం 9.15 గంటలకు ప్రతిష్టా మూర్తుల శోభాయాత్ర గ్రామ వీధుల్లో బ్రహ్మాండంగా జరిగింది. మాతలు భక్తులు మంగళహారతులతో ఎదురెల్లి స్వాగతం పలికారు. అనంతరం 11 గంటలకు స్వస్తి పుణ్య వచనం రక్షాబంధన దీపారాధన , ఆచార్య రుత్విక్కరణం జరిగాయి. మంటపారాధన, కుంభ స్థాపనము తరువాత తీర్థ ప్రసాద వినియోగం తో మొదటి రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసాయి.  18/2/2014 తదియ మంగళ వారం రోజు .... ఉదయం 6 గంటలకు సుప్రభాతము 9 గంటలకు గత స్థాపిత దేవతార్చన దివ్య ప్రభంద పారాయణం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది. మంటపారాధన, అగ్ని ప్రతిష్ట , నిత్య హోమము , స్థాపిత...

మొగిలిపేట లో నూతనంగా ఏర్పడిన విద్యుత్ సబ్ స్టేషన్

Image
ఖానాపూర్ తోవ లో సబ్ స్టేషన్ ప్రాంగణం . ప్రవేశ ద్వారము .

మొగిలిపేట గ్రామం లో శుద్ధ జల పరిశ్రమతో ఉపాది పొందుతున్న యువకులు.

Image
మన గ్రామం లో ఇదివరలో శుద్దజల కేంద్రం లేకుండేది ... కాని రెండేళ్ళ క్రితం మన గ్రామం లోని కొందరు యువకులు దీనిని ప్రారంభించి ఉపాదిని పొందుతున్నారు . సంతోషం. పాత గ్రామ పంచాయతి భవనం లో కేంద్రం మరియు నిర్వాహకుడు గొల్లవత్తుల విజయ్ . రవాణ కోసం సిద్దం గా ఉన్న వాహనం .

మల్లపూర్ మండలం లో మొదటి బ్యాంక్ - సిండికేట్ బ్యాంక్ మొగిలిపేట

Image
                             1981 ప్రాంతం లో మన గ్రామాలను దొరలు పరిపాలిస్తున్న రోజుల్లో మన గ్రామం లో ఫోన్ సౌకర్యం అలాగే బ్యాంక్ సౌకర్యం ఉన్నాయి . ఆనాటి గ్రామ పెద్దలు చాలా శ్రమించి మన గ్రామానికి బ్యాంక్ ను మంజూరి చేయించారు . ఇప్పటికీ చుట్టుపక్కల పది గ్రామాలకు మన బ్యాంక్ సీవలు అందిస్తున్నది .               తొలుత పెద్దబాపు శ్రీ రాజేశ్వర్ రావ్ ఇంట్లో మన బ్యాంక్ ఉండేది . మూడు దశాబ్దాల పాటు అదే భవనం నుండి సేవలు అందించింది . అనంతరం నేడు బస్టాండ్ సమీపం లో గల భవనం లోనికి మార్చబడింది . పై  రెండు  ఫోటోల్లో కనబడుతున్నవి పాత భవంతి లోని బ్యాంక్ చిత్రాలు .   ఈ పై రెండు చిత్రాల్లో కనిపిస్తున్నవి నూతన భవంతి లోనికి మారిన బ్యాంక్ చిత్రాలు .

పసుపు రైతులు పసుపును ఉడకబెట్టే పనిలో ఉన్నారు ... కాని పసుపు మద్దతు ధరలు పాతాళం లో ఉన్నాయి . ఘోరం .

Image
గత సంవత్సరం తో పోల్చినపుడు పసుపు రైతు తీవ్రమైన దిగాలు తో ఉన్నాడు . ఎందుకంటే గతం లో క్వింటాలు  రూ .15000 వరకు పలికిన మద్దతు ధర నేడు రూ. 5000 లకు పడిపోయింది. అతని శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు . ప్రభుత్వం దీని విషయం ఆలోచించాలి .   పసుపు  ఉడకబెట్టే యంత్రం  పసుపు రైతులు

బాలమ్మ బండల వద్ద బర్ల మంద

Image
గ్రామం లోని గాంధీ నగర్ అంటే ఎర్రగడ్డ పశువులు ముఖ్యంగా బర్ల మంద బాలమ్మ బండల వద్ద సేదదీరుతాయి . అక్కడే పశువుల దాహం తీరడానికి నీటి తొట్టి ఒకటి నిర్మించి ఉంది . చెరువు తీరం లో ఈ ప్రదేశం ఉంది.  పశువులకోసం నీటి తొట్టి  సేదదీరడానికి చింత చెట్లు మర్రి ఉన్నాయి . మర్రి కింద విశ్రాంతి లో బర్లు.

మామిడి పూత ల కాలం వచ్చింది ... మామిళ్ళు నిండుగా పగులుతున్నాయి .... సంతోషం.

Image
ఈ సారి మామిళ్ళు నిదు పూత తో పగులుతున్నాయి . మామిడి రైతులకు సంతోషకరమైన విషయం . అలా నేను చూసిన ఒక మామిడి నిండు దనాన్ని ఇక్కడ చూడవచ్చు .

రైతులకు అందుబాటులో గత 35 ఏళ్లు గా మొగిలిపేట లో సేవలు అందిస్తున్న పశువుల దవాఖాన

Image
గతం లో మంద రాజన్న ఇంటి వద్ద పశువుల దవాఖాన ఉండేది . ప్రస్తుతం స్వంత భవనం సమకూరాక కొత్త బస్టాండ్ సమీపం లో ఉంది . గోదావరి కి వెళ్ళే మార్గం లో పశువుల ఆసుపత్రి .

ప్రతీ చలి కాలం సీజన్ లో కనిపించే మావి , చిక్కుడు , ఉసిరి మొదలగు పూతలు మా పెరట్లో కనిపించిన పూతలు .

Image
 చిక్కుడు  పూత  ఉసిరి పూత   మామిడి పూత గ్రామాల్లో మామూలుగా ఈ సంక్రాంతి చలి కాలం లో మామిడి , ఇప్ప పూత వేయడాన్ని మామిండ్లు - ఇప్పలు పలుగు తాయి అంటారు . అంటే పూత విరగ బూస్తుంది అని అర్థం . మా గ్రామం  లోని మా కోటకాల్వ వద్ద గల మామిడి బాగు లోనివి ఈ ఫోటోలు .

మొగిలిపేట లో గత కొన్నేళ్లుగా అనేక రూపాల్లో ఉపయోగపడుతున్న పాత తరం భవంతి

Image
                మా ఎరుక నుండి మొదలు ఈ భవంతి ముందుగా గ్రామ తపాల కార్యాలయం గా ఉండేది . అది బహూశా 1980  ప్రాంతం లో , అనంతరం పాతశాలకు తగిన వసతి లేని కారణంగా ప్రాథమిక పాటశాలను ఇందులోకి మార్చారు . ఆ తరువాత పాటశాలకు ఇప్పుడున్న శాశ్వత భవనం చేకూరడం తో ఈ భవనం ఖాళీ అయ్యింది .       ప్రస్తుతం వయోజన నిరంతర విద్యా కేంద్రం గా ఉపయోగ పడుతోంది . పాత తరం భవనాల్లో మిగిలిఉన్న ఏకైక భవనం ఇదొక్కటే కావడం విశేషం .  

మొగిలిపేట ఉన్నత పాటశాల లో ఘనంగా స్వయంపరిపాలనా దినోత్సవం

Image
మొగిలిపేట ఉన్నత పాటశాలలో విద్యార్థులు నవంబర్ 14 న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని "స్వయంపరిపాలనా " దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు .

గ్రామాల్లో కి కూడా చేరుకున్న మనీ బదిలీ సంస్థలు - మొగిలిపేట లో ఉస్కెల చిన్నయ్య నడుపుతున్న western union.

Image
               సమకాలీన ప్రపంచం లో విశ్వమంతా ఒకే గ్రామం గా మారినట్టు తోస్తున్నది . సమాచార విప్లవం అనేక రూపాల్లో వివిధ సౌకర్యాలను సమకూర్చుతోంది . అలా గ్రామాల్లో ఇంటర్నెట్ అనేది వారికి చాలా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది . అలా మొగిలిపేట లో చిన్నయ్య అనే యువకుడు western union లాంటి మనీ ట్రాన్స్ ఫర్ సంస్థను నడుపుతున్నాడు . western union in Mogilipet                                                              చిన్నయ్య , నాగరాజు , గంగాధర్

మొగిలిపేట లో యువసేన యూత్ ఆధ్వర్యం లో భారతమాత విగ్రహ ఆవిష్కరణ

Image
                           యువసేన యూత్ ఆధ్వర్యం లో గ్రామం లో సేవా కార్యక్రమాలు బాగా సాగుతున్నాయి . ఈ క్రమం లో " ఈ భూమి మా తల్లి  మేము ఆమె పుత్రులము " అనే భావనతో  గ్రామం లో భవ్యమైన తల్లి భారత మాత విగ్రహం అవసరం అని భావించి గ్రామ వెంకటేశ్వర దేవాలయ సమీపం లో తేది . 18.12.2011రోజున    ఆవిష్కరించారు . సభ్యులు మాసులబుచ్చిరెడ్డి , పోగుల జీవన్ , ఒస రమేష్ , బి. శ్రీనివాస్ , మామిడాల క్రిష్ణపరందాం ( అధ్యక్షులు ) , వి.రమేష్ , వి. నరేష్ , ఎ.మహేష్ , ఎం .డి. ఇబ్రహీం ,సి .హెచ్ . విజయ్ మొదలగు వారు పాల్గొన్నారు .                        ఇట్టి విగ్రహావిష్కరణ కు స్థానిక MLA శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్ గారు ముఖ్య అతిథి గా విచ్చేసారు .                         ...

Google Earth లో మొగిలిపేట మరియు గోదావరి విహంగ చిత్రాలు.

Image
 మొగిలిపేట గ్రామం మరియు గ్రామానికి తూర్పున పెద్ద చెరువు ను చూడవచ్చును . ప్రక్రుతి సౌందర్యానికి పెట్టింది పేరు మొగిలిపేట చెరువు . మొగిలిపేట నుండి కేవలం  రెండు కిలోమీటర్ల దూరం లో ప్రవహిస్తున్న గోదావరి ... సరిగ్గా మా గ్రామం వద్దనే ఉత్తరానికి మళ్ళి ప్రయాణిస్తుంది . మధ్య లో పాయల వల్ల మిగిలిపోయిన భూభాగాలను చూడవచ్చును . వీటికి కుర్రు అని పేరు .

మొగిలిపేట గోదారి రేవు అందాలు - కథలు కథలు గా చెప్పుకునే ఆసక్తికర గ్రామీణ విషయాలు చిత్రాలు

Image
తామందిరికీ  స్వాగతం ! మొగిలిపేట  గ్రామం ఆనుకుని గోదావరి ప్రవహిస్తుంది . ఐతే విశేషం ఏమంటే సరిగ్గా మొగిలిపేట వద్దనే "L" వంపు తీసుకుని ఉత్తరం వైపుకు వెళుతుంది. ఒక ఇంటికి వీధిపోటు ఎలాగో అలాగే మా గ్రామం పైకి తూర్పుదిశగా నేరుగా గ్రామం పైకి గోదారి వస్తుంది. ఈ క్రమం లో  కొన్ని చిన్న చిన్న పాయల మూలంగా కొన్ని భూభాగాలు ద్వీపాల్లాగా మిగిలాయి . అవే గోదారి కి అందాన్ని తెచ్చిపెట్టాయి . గ్రామం నుండి గోదారి ఒడ్దుకు చేరుటకు రెండు దార్లు ఊరు మొదట్లో ఒకటి , ఊరు దాటాక ఒకటి ఉన్నాయి . మొదట్లో ఉన్న దారి "పాల రేవు " కు తీసుకెళ్లగా రెండవ దారి "బండి రేవు " కు తీసుకుపోతుంది.  పై రెండు చిత్రాల్లో గోదారి నిలకడను , అలాగే గోదారి పరవళ్ల ను చూడవచ్చును .  సముద్ర తీరాలను తలపించే ఇసుక తిన్నెలు గోదారి తీరానికి ఎంతో అందాన్ని తెచ్చాయి .  "నేతి గుండం" అని పిలువబడే ఈ నీటి నిలువలు రాతి గుట్టల పై పది అడుగుల ఎత్తున ఎండి పోకుండా ఉండడం విశేషం . నేతి లాగ నూనె నూనె లా ఉండడమే ఈ గుండానికి ఆ పేరు ...