Posts

Showing posts with the label మన సమస్యలు

మన గ్రామానికి భవిష్యత్తు లో స్మశాన వాటిక అవసరం ...?!

                     చాలా కాలం నుండి మన గ్రామ శివార్లలో చెరువు గట్టు , మడుగు మీద ,ఎక్కడ బీడు ఖాళీ జాగలు కనిపిస్తే అక్కడ కాలేస్తున్నాం . కాని వర్షాకాలం లో ఊరు చుట్టూ నీరు చేరుకునే సరికి దహన కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళాలో తోచని స్థితి . అలాగే దహనానికి జాగ దొరికినా స్నానాదులకు ఎటు వెళ్ళాలనేది మరో ప్రశ్న ?!                     కనుక ఊరి కి ప్రధానంగా మూడు వైపుల మూడు విదాల ఎకరమో అర ఎకరమో కాదంటే గుంటల్లో భూమి ని కొని సిద్ధం చేస్తేనే సరి ....!                   ఇప్పటికే దూదేకుల ,ముస్లిం కులాలు స్థలాలు  లేక తోటల మధ్య గల పాత స్థలాల్లో కార్యక్రమాల కోసం ప్రక్కన ఉన్న భూ యజమానులను బ్రతిమిలాడ వలసి వస్తున్నది.                   ఈ సమస్య మొదటి ప్రాధాన్యం గా గల సమస్యగా చూడాల్సి ఉంది.