Posts

Showing posts from January, 2011

మన గ్రామానికి భవిష్యత్తు లో స్మశాన వాటిక అవసరం ...?!

                     చాలా కాలం నుండి మన గ్రామ శివార్లలో చెరువు గట్టు , మడుగు మీద ,ఎక్కడ బీడు ఖాళీ జాగలు కనిపిస్తే అక్కడ కాలేస్తున్నాం . కాని వర్షాకాలం లో ఊరు చుట్టూ నీరు చేరుకునే సరికి దహన కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళాలో తోచని స్థితి . అలాగే దహనానికి జాగ దొరికినా స్నానాదులకు ఎటు వెళ్ళాలనేది మరో ప్రశ్న ?!                     కనుక ఊరి కి ప్రధానంగా మూడు వైపుల మూడు విదాల ఎకరమో అర ఎకరమో కాదంటే గుంటల్లో భూమి ని కొని సిద్ధం చేస్తేనే సరి ....!                   ఇప్పటికే దూదేకుల ,ముస్లిం కులాలు స్థలాలు  లేక తోటల మధ్య గల పాత స్థలాల్లో కార్యక్రమాల కోసం ప్రక్కన ఉన్న భూ యజమానులను బ్రతిమిలాడ వలసి వస్తున్నది.                   ఈ సమస్య మొదటి ప్రాధాన్యం గా గల సమస్యగా చూడాల్సి ఉంది.

మొగిలిపేట లో JAC ఆధ్వర్యం లో దిగ్విజయంగా "రస్తా రోఖో "

Image
                 నేడు JAC పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా "రస్తా రోఖో " లు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొగిలిపేట లో కూడా కార్యక్రమం జరిగింది.                  ఇట్టి కార్యక్రమం లో గ్రామ JAC నాయకులు గోల్కొండ పవన్  కుమార్ , సర్పంచ్ ,MPTC, అన్ని పార్టీల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ తరువాత నాయకులంతా వెళ్లి బాదనకుర్తి బిడ్జ్ వద్ద మహా రాస్తా రోఖో కార్యక్రమాన్ని నిర్వహించి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లా ల సరిహద్దు ను దిగ్బంధం చేశారు. పోలీసులకు , తెలంగాణ వాదులకు మధ్య వాగ్వివాదం జరిగింది. వాల్గొండ వరకు జై తెలంగాణ నినాదాలతో రహదారి దద్దరిల్లింది.