Posts

Showing posts from October, 2010

మా బడి నుండి... గిజిగాడి పిట్టగూల్ల దగ్గరికి వెళ్లి పాఠ్యాంశాన్ని ప్రత్యక్షంగా భోదిస్తున్న శర్మగారు.

Image
                           మొగిలిపేట పాటశాల లో కేవలం సైన్స్ లే గాక భాషా విషయాలను కూడా ప్రత్యక్ష  సందర్శన గావించి, పిల్లలకు చక్కటి విషయ అనుభవాన్ని ఇస్తున్నమహేశ్వర శర్మ గారి ప్రయత్నం అభినందనీయం. దీని వల్ల పిల్లల్లో ఉత్సాహం, ఉల్లాసం తో పాటు మరిచిపోని రీతి లో గుర్తుంచుకొనే అవకాశం లభిస్తుంది. ఇలా వారు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతీ వారాంతం లో ఏదేని కవి పరిచయం చేయడం జరుగుతోంది. చూడండి మా శర్మ గారి గిజిగాడి సందర్శన : అమ్మో  ఈ తుమ్మ కు ఎన్ని గూల్లో.... అంతా గిజిగాడి ఇంజనీరింగే మరి...! గుఱ్ఱం జాషువా గారి వర్ణన ను ప్రత్యక్షంగా పోల్చుకుంటున్న విద్యార్థులు . వివరణ లో లీనమైన శర్మ గారు. కేవలం గిజిగాడి గురించే కాదు, తుమ్మ చెట్ల వల్ల లాభం ... అలాగే తుమ్మ వల్ల పొలం కు మరియు రైతులకు గల లాభాలను వివరిస్తున్న శర్మ గారు. గోదావరి ఒడ్డున మా తెలుగు మాస్టారు..... శర్మ గారు.

విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచుతున్న మొగిలిపేట పాటశాల లోని వారాంత కార్యక్రమాలు.

Image
                             మొగిలిపేట పాటశాల లో గణితం సారు రామ్మోహన్ గారి ఆధ్వర్యం లో ప్రధానోపాద్యాయులు గోవర్ధన్ గారి సమక్షం లో  నియమితంగా  ప్రతి శనివారం విద్యార్థులలో జిజ్ఞాస, వ్యక్తిత్వ వికాసం ,భాషా జ్ఞానం, విజ్ఞాన విషయాలు, చిక్కు ప్రశ్నలు, పిల్లల నుండి సహజంగా నిత్యజీవితం లో అర్థం గాని ప్రశ్నల ను రాబట్టి  సమాధానాలతో కార్యక్రమమం యోజన చేసి అమలు చేయడం జరుగుతోంది. ఇది అత్యంత సహజంగా నిర్వహించడం విశేషం. పిల్లలు శనివారం ఎప్పుడొస్తుందా అనే రీతి లో సాగుతోంది. ఈ శనివారం విశేషాలు ( తేది : 23.10.2010 ) : పాటశాల ప్రాంగణం లో సమావేశమైన విద్యార్థులు. సి. నా . రె    కవి పరిచయం తో కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్న శర్మ గారు. ఆసక్తి గా వింటున్న విద్యార్థులు . ఉపాధ్యాయులు ...విద్యార్థులు . సైన్స్ సార్ జనార్ధన్ గారు  నీటి లో కొన్ని వస్తువులు మునుగుటకు, తేలుటకు గల కారణాలను కృత్యం ద్వారా తెలిపారు. అలాగే గణితం సార్  రాము గారు  సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడానికి గల కారణం ఏమి ? స్వేచ్చగా వేలాడదీసిన అయస్కాంతం ఎందుకు ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది ? లాంటి విద్యార్థుల ప్రశ్నలను కృత్

మొగిలిపేట పాటశాలలో పదవతరగతి పిల్లల తల్లిదండ్రుల తో ఉపాధ్యాయుల సమావేశం _ విశేషాలు.

Image
                         పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గోవర్ధన్ గారి ఆధ్వర్యం లో తేది : 25.10.2010 రోజున  పదవతరగతి పిల్లల తల్లి దండ్రుల తో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో పిల్లల ప్రగతి మరియు రాబోవు ssc పరీక్షల కోసం తల్లి దండ్రులు పిల్లల పట్ల  తీసుకోవలసిన జాగ్రత్తలు  గురించి చర్చించడం జరిగింది. విషయాలు : పిల్లల ప్రగతి పత్రాలను తల్లిదండ్రుల తో కలసి విశ్లేషించడం జరిగింది. పిల్లలను ప్రతీ రోజు ప్రాతః కాలముననే లేపి చదివించాలని కోరడమైనది. ప్రతీ ఉపాధ్యాయుడు తన subject  కు సంబంధించి విద్యార్ధి మెరుగు కోసం సూచనలను చేశారు. త్రైమాసిక ఫలితాల పై విశ్లేషణ జరిగింది ... అనువర్తి గా చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. పిల్లల లో చదువు తో పాటు సంస్కారాన్ని పెంపొందించుటకు తగు సూచనలను చేయడం జరిగింది. సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు. సమావేశాన్ని ప్రారంభిస్తున్న తరగతి ఉపాధ్యాయులు  శర్మ గారు. వేదిక పై ఆసీనులైన ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ గారు , గ్రామ ప్రముఖులు వెంకట్రెడ్డి గారు  , ssc  పరీక్షల ఇంచార్జ్ లింగన్న గారు.

దుడ్డె తినడానికి లేలేత ఎనాద్రి మొక్కను మేత గా వేస్తారు .. దాని లేత చివురుకు సుతి మెత్తని మేత .

Image
పసి పాప గా ఈ లోకం లోకి వచ్చిన బర్రె ( గేదె ) పిల్ల దుడ్డె  కోసం వేసే గడ్డి మొక్క పేరే ఎనాద్రి .

అనవసర వర్షాలతో నానిపోతున్న మక్క కంకి .... దిక్కు తోచని రైతు.

Image
                                   ఇటీవలి అల్పపీడన వర్షాల వల్ల తోట్లో, మైదానాల్లో ఆరబెట్టేందుకు ఉంచిన మక్క కంకి నాని పోయింది. వర్షాలు వచ్చాయి అనే ఆనందం లో బీడు భూముల్ని కూడా సాగు లోకి తెచ్చిన రైతులకు నిరాషే మిగిలింది. మార్కెట్ లో ఏమాత్రం ధర పలకని కంకి ని ఏంచేయాలో అర్ధం గాక రైతులు దిగాలు పడుతున్నారు. మంచి దిగుబడి వచ్చిందన్న ఆనందం లేకుండా పోయింది...! ఆరుబైట కంకి కుప్పలు పోసిన రైతులు .... వర్షాల తో తడిసాయి.

బతుకమ్మ ను పేర్చడం కోసం వాడే పూలు - గునక, కట్లె, బంతి, తంగేడు చూడండి.

Image
తెలంగాణ ఆడపడుచుల పండుగ :                   బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆరాధ్య దైవం. సంవత్సరాని కొకసారి గౌరమ్మ ను తలచుకొని మురిసిపోయే రోజు. ఇంటిల్లిపాది ఎదిరి చూసి చూసి పండగ రాగానే అటు పూల కోసం ఇటు నిత్య నైవేద్యం కోసం పరుగులు పెట్టే రోజు. రోజూ  సాయంత్రం ఊరు వాడ అంతా కలసి మనసారా ఆటాడుకునే రోజు . బతుకమ్మ రోజు. బతుకమ్మ ను పెర్చడానికి వాడే పూలు ఇవి :                               ఈ పూల కోసం ఆ ఇంటి అన్నయ్య , నాన , అమ్మ , అమ్మమ్మ, అక్కయ్య , తాతయ్య ఒకరేంటి అంతా అడవి కి పరుగో పరుగు. తంగేడు పువ్వు : కట్లె పువ్వు : గునుక పువ్వు : ఈ పువ్వును అధికంగా వాడతారు. బంతి పువ్వు : బతుకమ్మ ను ఈ పూల తో ఎలా పెర్చుతారో ఈ లింక్ ని నొక్కడం ద్వారా చూడండి : http://mogilipet.blogspot.com/2010/10/blog-post_13.html

మొగిలిపేట లో ఘనంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం.

Image
అమ్మవారి నిమజ్జన కార్యక్రమం : నవమి రాత్రి విపరీతమైన వర్షం కారణంగా తెల్లవారి దశమిఉదయం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా మహీశాసుర మర్ధన కార్యక్రమం జరిగింది. ఉరేగింపుగా అమ్మవారు. మహిషాసురుని తయారీ లో యువకులు బిజీ ..! అమ్మవారి క్రోధాగ్ని కి దహించుకు పోతున్న మహిషాసురుడు. జై భవాని ...!   జై జై భవాని ....!

అమ్మవారి నవరాత్రుల్లో కార్యక్రమాలు - చిన్నారుల నృత్యాలు.

Image
మొగిలిపేట లో అమ్మవారి నవరాత్రుల సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శన జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కడకుంట్ల నవీన్. తిలకిస్తున్న గ్రామస్తులు.

మొగిలిపేట లో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు - దుర్గాదేవి ఉత్సవ సమితి.

Image
దుర్గానవరాత్రులు :                              గత ఏడు సంవత్సరాలుగా దుర్గా నవరాత్రి ఉత్సవాలను మొగిలిపేట లో నిర్వహించడం జరుగుతోంది. తొలుత నేతాజీ యూత్ ప్రారంభించినప్పటికీ అనంతరం గ్రామ యువజనుల ఆధ్వర్యం లో ఉత్సవ సమితి గా ఏర్పడి నిర్వహిస్తున్నారు . అమ్మవారి దీక్షలు :                                  ఈ సందర్భంగా యువకులు అమ్మవారి దీక్షలు తీసుకుని ఎంతో నిష్ట తో  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు వారు దీక్షలో ఉండి అమ్మవారిని సేవిస్తారు. తొమ్మిది రోజుల్లో అమ్మవారి భోనాలు, కుంకుమ పూజలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పక్కా ప్రణాళిక తో ముందస్తు యోజన తయారు చేసుకుని  అమ్మవారిని నిలబెడతారు. ఆ మేరకు గ్రామ పెద్దలు, ప్రజల నుండి సహకారం లభిస్తోంది. అమ్మవారి ఆభరణాలు, వస్త్రాలు, నైవేద్యం , ఇలా వివిధ విషయాలన్నీ గ్రామం లోని భక్తులు స్వయంగా ముందుకొచ్చి చూసుకుంటున్నారు. కాలక్షేపం :                               కాలక్షేపంగా బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పించడం. బుర్రకథలు, హరికథలు , పిల్లలచే నాట్య ప్రదర్శన చేయించడం , ప్రవచనాలు చెప్పించడం జరుగుతోంది.           గ్రామం మొత్తం లో ఓకే అమ్మ

బతుకమ్మ తయారీ లో చిన్నారులు ... రంగు రంగుల పూల పండగ.

Image
బతుకమ్మ :                         బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతం లోని మహిళలు, ఆడపిల్లలు జరుపుకునే పండగ. ఆనందంగా ఆడే ఆట - పాట. ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో అనగా శరదృతువు ఆశ్వయుజ మాసం లో వస్తుంది. ఈ పండగనే బొడ్డెమ్మ అని కూడా పిలుస్తారు. పిల్లలు ఆడే ఆట పాట బొడ్డెమ్మ. అలాగే మహిళలు ఆడే పాడే ఆట ను బతుకమ్మ అంటారు. పెత్రమావాస్య రోజు బొడ్డెమ్మ బాయి తోడుకొని  9 లేదా 11 రోజుల వరకు రోజు సాయంత్రం పుట్టమన్ను తో మేగి రంగు రంగు ల పూల తో అలంకరించి ఆ వీధి పిల్లలు పెద్దలు కూడి బతుకమ్మ జానపదాలు పాడుతూ తప్పెట్ల తో అమ్మవారిని కొలుస్తూ చుట్టూ తిరుగుతూ ఆడతారు.                           చివరగా తొమ్మిదవ లేదా పదకొండవ రోజు అమ్మలక్కలు రంగు రంగు ల పట్టు చీరలు ,ఒంటి నిండా ఆభరణాలు ధరించి , ఒక పళ్ళెం లో గాని  లేదా తాంబూలం లో  గాని బంతి, గునక, గుమ్మడి, కలువ, అల్లి, కట్లె లాంటి రంగు రంగుల పూలతో అమ్మవారిని అనగా బతుకమ్మను పేర్చి ఉరేగింపుగా గ్రామ వీధులగుండా వెళతారు. మధ్య మధ్యలో చావిళ్ళ వద్ద బతుకమ్మ లను దించి మధ్య లో వుంచి చుట్టూ తిరుగుతూ బతుకమ్మలాడుతారు.                          ఈ కోలాహలం లో గ్రామ ప్రజలంతా

మొగిలిపేట లో నిమజ్జన దృశ్యాలు .

Image
                                      మొగిలిపేట లో వినాయక  నిమజ్జనం రెండు రోజులు సాగింది . తొమ్మిది , పదకొండు రోజుల్లో  కార్యక్రమాన్ని కొనసాగించారు. కోలాటం , భజన ల తో గ్రామస్తులు గణనాయకుని కి వీడ్కోలు పలికారు . కోలాటం ...గణనాథుని కి వీడ్కోలు.

పెద్దమ్మ తల్లి - ఊరికి పెద్ద దిక్కు ఆపదల్లో ఆదుకునే అమ్మవారు .

Image
                                                           "అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ "                     హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ వారిని అనేక రూపాల్లో కొలుస్తారు . అందులో ఒక రూపం " పెద్దమ్మ తల్లి ".                                    మా గ్రామం లో ఊరికి ఉత్తరాన తూరుపుకి అభిముఖంగా అమ్మవారి దేవాలయం ఉంది . ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి " పెద్దమ్మ జాతర "   విశేష కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భం లో అమ్మవారికి , ఆలయానికి నకాయిషి అనే ప్రత్యేక వృత్తి లో వుండే కళాకారులతో రంగులద్దింప జేస్తారు . గ్రామస్తులంతా అమ్మవారి దర్శనం తో పాటు అక్కడే వంటలు చేసుకుంటారు . ప్రత్యేక మొక్కులున్నావారు , నియమిత మ