Posts

Showing posts from March, 2011

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.

Image
పసుపు సాగు చేస్తున్న ప్రధాన ప్రాంతాల్లో కరీంనగర్ ,నిజామాబాద్ లు ముఖ్యమైనవి. సంప్రదాయ  పద్దతుల్లో పసుపును పెద్ద పెద్ద "కడాయిల్లో " పెద్ద గోతులు తవ్వి ఉడకబెడుతుంటారు. ఈ సీజన్ లో ఊరికి నాలుగు ఐదు చొప్పున పసుపు ఉడకబెట్టడానికి బాయిలర్లు వచ్చాయి. పూర్తిగా  ఆవిరి తో ఉడికే పద్దతి కావడం వల్ల తక్కువ  కట్టెల తోనే బోలెడు పసుపు ఉడుకుతోంది . రైతులు దాదాపు అందరూ ఈ యంత్ర్రాల ద్వారానే ఉడకేస్తున్నారు . తక్కువ పసుపు దిగుబడి వచ్చిన వాళ్ళు మాత్రం కడాయిల్లో ఉడకేస్తున్నారు . మొత్తానికి అవసరాలు , కాలం తో పాటు  మార్పు కళ్ళ  ముందే అగుపిస్తోంది....... క్రింద వీడియోలో ఉడకబెట్టే  యంత్రాన్ని చూడవచ్చు .  

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

Image
           మోదుగు పూలు :   FIRE OF FOREST గా పేరుగాంచిన మోదుగు పూలు పేరుకు తగ్గట్టుగానే అడవి లో ఎక్కడున్నా ఎర్రని పూలతో అట్టే తెలిసిపోతాయి. గుత్తులు గుత్తులు గా ఎంతో బాగా ఆకట్టుకుంటాయి. వీటిని సేకరించి ఎందబెట్టుకుని తరువాత పొడిగా మార్చుకుని చాలా మంది టీ పొడిగా వాడతారు. ఆరోగ్యానికి మంచిది.   అందమైన  మోదుగు పూల గుత్తి    మోదుగు  పూల కొమ్మ    మోదుగు చెట్టు -  నేను    మోదుగు  పూల తో మా పిల్లలు సృజన్ మరియు అచ్యుత్  ఇలా అడవి తోవల్లో  వచ్చిపోయే వారిని ఎంతో అందంగా ఆకట్టుకునే పూవు మోదుగుపువ్వు .

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

Image
               అడవి ఒకో ఋతువులో ఒకో అందాన్ని అలంకరించుకుంటుంది. ఈ శిశిరం లో మోదుగు పూల తో మొదలై బూరుగు చెట్టు  ఒంటి నిండా బూరుగు పూలతో ఎర్రని రంగు లో అడవి సిగ లో అందమైన పువ్వు లా ఉంటుంది. బూరుగు పువ్వు ను  క్రింద చూడండి .              సరదా విషయం ఏమంటే .... గ్రామాల్లో పిల్లలు చెరువు కు స్నానానికి వెళితే ...అక్కడి బూరుగు చెట్టు యొక్క ఖాండం పై గల ముళ్ళను తీసుకుని వాటిని టేకు చెట్టు నారలో చుట్టుకుని తాంబూలం లాగా నోట్లో వేసుకుని నములుతారు . కాసేపటికి నోరంతా ఎర్రగా మారుతుంది. భలే హాయిగా ఆడుకుంటూ ఉంటారు. మీరు కూడా వేసుకోండి మరి ......   బూరుగు  పువ్వు   బూరుగు  చెట్టు    ఎర్రని  బూరుగు పువ్వు అందం.

మట్టి బతుకులు - కుమ్మరి రాజన్న కుండల తయారీ వీడియో

Image
కుండలు తయారు చేస్తున్న కుమ్మరి రాజన్న.

మట్టి బతుకులు - కుమ్మరి రాజన్న కుండల తయారీ ఫోటోలు

Image
                      మారుతున్న జీవన శైలి కారణంగా మన కుల వృత్తులు కనిపించకుండా పోతున్నాయి. ఈ క్రమం లో మా గ్రామం లో కుండల తయారీ ని కొనసాగిస్తున్న ఏకైక కుమ్మరి "రాజన్న" మాత్రమే. అతన్ని కలిసినపుడు తీసిన ఫోటోలు. కుండలు చుడుతున్న రాజన్న  తయారు చేసిన మట్టి పాత్రలు.