Posts

Showing posts from July, 2010

శితవల్క-జిల్లేడు మొక్కలు

Image
                                               పల్లె లో మనకి నిత్యం అనేక మొక్కలు దర్శన మిస్తుంటాయి.అవి మనల్ని మన ఊరి వాతావరణం లో వున్నామనే బావాన్ని కలిగిస్తాయి. కొన్ని ఎప్పుడు చూస్తూనే వుంటాం. అరె ఇక్కడో చేట్టుండాలే ఏమైనట్టు అని కూడా అనిపిస్తుంది. అలా మనం నిత్యం దర్శించే మొక్కల్ని చూద్దాం....... శీతాఫల చెట్టు జిల్లేడు చెట్టు 

మన స్కూల్ వనమహోత్సవ విశేషాలు

Image
మన మొగిలిపేట  గ్రామ పాటశాలలో 16-7-2010 రోజున వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటడం జరిగింది. ఆ కార్యక్రమ విశేషాలు దృశ్య రూపంలో మన గ్రామస్థుల మరియు మన శ్రేయోభిలాషుల కోసం ....  మొక్కలు నాటడం ప్రారంభిస్తున్న ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ గారు.  ఈ క్రింద మన పాటశాల ఫోటోలు చూడవచ్చు.

పొదిలో ఎడ్లు

Image
వేసవి వచ్చిందంటే మన సేన్ల నో సేల్కల్నో ఒక పొది వేసి ఎడ్ల కు విడిది చేస్తాం ...అలాంటి ఒక పోదే ఇది. అలాగే కొట్టాల్లో ధాన్యం, పశువుల్ని ఉంచే ఏర్పాట్లు కూడా వుంటాయి.

స్వర్గీయ శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్ గారు ( కవి - గాయకుడు - నటుడు )

Image
  స్వర్గీయ శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్ :                                          శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్ గారికి జన్మతః సహజాతంగానే రచన, గానం, నటన వచ్చినాయనిపిస్తుంది. వారి వాచకం బాషణం లో ఉట్టిపడే పద విన్యాసం ఎదుటివారిని అలా కట్టి పడేసేవి. ఊర్లో ఆ రోజుల్లో సాగరన్న అంటే తనకు తెలంది  లేదు అని జనం చెప్పుకునేవారు. తను ఒక పద్యం, ఒక పాట, ఒక శ్లోకం పాడితే జనమంతా మంత్ర ముగ్దులై వింటూ ఉండేవారు . గ్రామం లో ఎందరో మలి తరం  యువకులకు వారి స్పూర్తి గా నిలిచారు. దేశ దేశాల్లో సాగిన వారి జీవన యానం వారిని ఇంకా పరిపక్వం లోకి తెచ్చింది. వారు మస్కట్ లున్న, బొంబాయ్ లున్న ఈ ఊరి మననం చేయనిదే ఉండలేదు. తను మస్కట్ కెళ్ళి ఆడియో క్యాసెట్ నింపి పంపితే వాడంతా వాళ్ళింట్లో వాలి కొన్ని రోజులు వినేవారు. ఆ క్యాసెట్ లో వారు కేవలం ఊరి ఇంటి బాగోగులే గాక అనేక జానపద  మాండలీక భాగవత గాధల్ని పాడి పంపేవారు. అదొక పల్లె ఆల్బం గా చెప్పుకోవచ్చు.                                          అనంతరం వారు ఊర్లో " జ్ఞాన విహార్ శిశుమందిర్ " పేరు తో పాటశాలను నడిపారు. ఆ సమయం లోనే రచానా వ్యాసంగాన్ని తిరిగి ప్రారంభించారు. అందులో భ

నవ శాస్త్రి యువజన సంఘం

Image
   నేపథ్యం                      1970  దశకం లో మన ఊర్లో అంటే దొరలున్న జమాన్లో దాదాపు ఏ సంఘాలు లేవు కాని అప్పిటికి కాస్తో కూస్తో విద్యావంతులుగా ఉన్న గోల్కొండ సీతారాం, శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్, చట్లపెల్లి చిన్ననర్సయ్య - పెద్ద నర్సయ్యలు, ద్యావతి ముత్తన్న, టెక్స్ నర్సయ్య , అంకతి పెద్దరాజన్న మొదలగు వాళ్ళు వాళ్ళ అవగాహన మేరకు "శాస్త్రి యువజన సంఘం " పేరు తో యువజన సంఘాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సంఘం ద్వారా గ్రామం లో అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పించారు. ఒక నిబద్దతతో క్రమశిక్షణతో వారు సంఘాన్ని నడిపారు. ప్రతీ మాసం క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకుని గ్రామ పరిస్థుతుల గురించి ఆలోచించేవారు . ప్రజల్లో అవగాహన పెంచేదానికి చిన్న చిన్న నాటికలను వేసేవారు. స్వయంగా విద్యాసాగర్ గారు రచయిత కళాకారుడు అవడం చేత నాటకాలు రచించి దర్శకత్వ భాద్యతలను నిర్వహించే వారు. అలా వారు వేసిన " తాగు బోతు " అనే నాటికను ఇప్పటికి మన గ్రామస్తులు యాజ్జేసుకుంటారు .  ఆ నాటిక లో తాగడం వల్ల అనర్ధాలను తెలియజెప్పారు.                   వీలైనంత వరకు వారి సమయాన్ని గ్రామ వికాసం కోసమే వెచ్చించే వారు