తామందిరికీ స్వాగతం ! మొగిలిపేట గ్రామం ఆనుకుని గోదావరి ప్రవహిస్తుంది . ఐతే విశేషం ఏమంటే సరిగ్గా మొగిలిపేట వద్దనే "L" వంపు తీసుకుని ఉత్తరం వైపుకు వెళుతుంది. ఒక ఇంటికి వీధిపోటు ఎలాగో అలాగే మా గ్రామం పైకి తూర్పుదిశగా నేరుగా గ్రామం పైకి గోదారి వస్తుంది. ఈ క్రమం లో కొన్ని చిన్న చిన్న పాయల మూలంగా కొన్ని భూభాగాలు ద్వీపాల్లాగా మిగిలాయి . అవే గోదారి కి అందాన్ని తెచ్చిపెట్టాయి . గ్రామం నుండి గోదారి ఒడ్దుకు చేరుటకు రెండు దార్లు ఊరు మొదట్లో ఒకటి , ఊరు దాటాక ఒకటి ఉన్నాయి . మొదట్లో ఉన్న దారి "పాల రేవు " కు తీసుకెళ్లగా రెండవ దారి "బండి రేవు " కు తీసుకుపోతుంది. పై రెండు చిత్రాల్లో గోదారి నిలకడను , అలాగే గోదారి పరవళ్ల ను చూడవచ్చును . సముద్ర తీరాలను తలపించే ఇసుక తిన్నెలు గోదారి తీరానికి ఎంతో అందాన్ని తెచ్చాయి . "నేతి గుండం" అని పిలువబడే ఈ నీటి నిలువలు రాతి గుట్టల పై పది అడుగుల ఎత్తున ఎండి పోకుండా ఉండడం విశేషం . నేతి లాగ నూనె నూనె లా ఉండడమే ఈ గుండానికి ఆ పేరు ...