మొగిలిపేట గోదారి రేవు అందాలు - కథలు కథలు గా చెప్పుకునే ఆసక్తికర గ్రామీణ విషయాలు చిత్రాలు


తామందిరికీ  స్వాగతం !
మొగిలిపేట  గ్రామం ఆనుకుని గోదావరి ప్రవహిస్తుంది .
ఐతే విశేషం ఏమంటే సరిగ్గా మొగిలిపేట వద్దనే "L" వంపు తీసుకుని ఉత్తరం వైపుకు వెళుతుంది.
ఒక ఇంటికి వీధిపోటు ఎలాగో అలాగే మా గ్రామం పైకి తూర్పుదిశగా నేరుగా గ్రామం పైకి గోదారి వస్తుంది.
ఈ క్రమం లో  కొన్ని చిన్న చిన్న పాయల మూలంగా కొన్ని భూభాగాలు ద్వీపాల్లాగా మిగిలాయి .
అవే గోదారి కి అందాన్ని తెచ్చిపెట్టాయి .
గ్రామం నుండి గోదారి ఒడ్దుకు చేరుటకు రెండు దార్లు ఊరు మొదట్లో ఒకటి , ఊరు దాటాక ఒకటి ఉన్నాయి .
మొదట్లో ఉన్న దారి "పాల రేవు " కు తీసుకెళ్లగా రెండవ దారి "బండి రేవు " కు తీసుకుపోతుంది.

 పై రెండు చిత్రాల్లో గోదారి నిలకడను , అలాగే గోదారి పరవళ్ల ను చూడవచ్చును .

 సముద్ర తీరాలను తలపించే ఇసుక తిన్నెలు గోదారి తీరానికి ఎంతో అందాన్ని తెచ్చాయి .

 "నేతి గుండం" అని పిలువబడే ఈ నీటి నిలువలు రాతి గుట్టల పై పది అడుగుల ఎత్తున ఎండి పోకుండా ఉండడం విశేషం . నేతి లాగ నూనె నూనె లా ఉండడమే ఈ గుండానికి ఆ పేరు తెచ్చింది.

 "పాల గుండం " పేరు తో ఇది కూడా మరో చోట రాళ్ళ వరుసల్లో చాలా ఎత్తైన రాయి పై నున్న గుండం . ఇందులో నీరు పాల లా తెల్లగా ఉండడం చేత పాల గుండం అని స్థానికులు పిలుస్తారు .

 ఇది ఒక ఇతిహాస ఘట్టానికి సంబంధించిన విషయం . ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో పాదం ఆకారాన్ని చూడవచ్చును . ఐతే ఒకప్పుడు గోదారి ఉగ్రరూపం దాల్చి మహా వేగం తో ప్రవహిస్తూ నేరుగా గ్రామం మీదకు అలాగే గ్రామాన్ని ఆనుకుని ఉన్న సోమన్న(శివుడు ) గుట్ట ను ముంచెత్త డానికి రాగా ఆగ్రహించిన సోమన్న మా గ్రామం లోని వాన బండల్లో ఒక అడుగు అలాగే నడి మధ్య గంగ లో ఒక అడుగు వేశాడని , అందుకే ప్రవాహం ఎడమకు తరలి పోయిందని . గంగమ్మ ను తన రెండడుగు లతో పక్క దారి పట్టించాడని ఇక్కడి వారి నమ్మకం . ఆ అడుగు "సోమన్న అడుగు ముద్ర " గా ప్రతీతి చెందినది . అదీ సంగతి .

 ఇక్కడ ఉన్న మరో పాద ముద్ర గోదావరి లో మరో చోట అగుపిస్తుంది . దీని చరిత్ర ఏమంటే నాడు రాముల వారు అరణ్య వాసం చేస్తున్న సమయం లో ఈ తీరానికి కూడా చేరుకున్నాడని , ఇక్కడ అమ్మవారు చీర ఆరవేసుకున్నారని ఆ చీర అంచును కూడా ఆ రాళ్ళ పై ఉంది . దానితో పాటే రాముల వారు నడిచిన పాద ముద్రలు కూడా ఉన్నాయని , అవే ఇవి అని ఇక్కడి వారి నమ్మకం..అదే రాములవారి పాదం గా ప్రసిద్ధి .



 గోదారి లో నడుస్తూ ఉంటె రాళ్ళ బొరియలు , గుహలు , గుట్టల తో పాటు ఇలాంటి పర్వత శిఖరాలు కూడా ఉన్నాయి . ఆ శిఖరం పై ఉన్నవారు ఈ బ్లాగ్ సభ్యుడు శ్రీ గోల్కొండ రామ్మోహన్ అలాగే ఈ చిత్రాల్ని మనకు అందించిన కెమరా మెన్ శ్రీ చిట్యాల శ్రీధర్.

ఇలాంటి లోతైన లోయ సమానమైన ఇరుకు ప్రవాహాలను కూడా మా గోదారి చూడవచ్చును .

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట