Posts

Showing posts from October, 2011

Google Earth లో మొగిలిపేట మరియు గోదావరి విహంగ చిత్రాలు.

Image
 మొగిలిపేట గ్రామం మరియు గ్రామానికి తూర్పున పెద్ద చెరువు ను చూడవచ్చును . ప్రక్రుతి సౌందర్యానికి పెట్టింది పేరు మొగిలిపేట చెరువు . మొగిలిపేట నుండి కేవలం  రెండు కిలోమీటర్ల దూరం లో ప్రవహిస్తున్న గోదావరి ... సరిగ్గా మా గ్రామం వద్దనే ఉత్తరానికి మళ్ళి ప్రయాణిస్తుంది . మధ్య లో పాయల వల్ల మిగిలిపోయిన భూభాగాలను చూడవచ్చును . వీటికి కుర్రు అని పేరు .

మొగిలిపేట గోదారి రేవు అందాలు - కథలు కథలు గా చెప్పుకునే ఆసక్తికర గ్రామీణ విషయాలు చిత్రాలు

Image
తామందిరికీ  స్వాగతం ! మొగిలిపేట  గ్రామం ఆనుకుని గోదావరి ప్రవహిస్తుంది . ఐతే విశేషం ఏమంటే సరిగ్గా మొగిలిపేట వద్దనే "L" వంపు తీసుకుని ఉత్తరం వైపుకు వెళుతుంది. ఒక ఇంటికి వీధిపోటు ఎలాగో అలాగే మా గ్రామం పైకి తూర్పుదిశగా నేరుగా గ్రామం పైకి గోదారి వస్తుంది. ఈ క్రమం లో  కొన్ని చిన్న చిన్న పాయల మూలంగా కొన్ని భూభాగాలు ద్వీపాల్లాగా మిగిలాయి . అవే గోదారి కి అందాన్ని తెచ్చిపెట్టాయి . గ్రామం నుండి గోదారి ఒడ్దుకు చేరుటకు రెండు దార్లు ఊరు మొదట్లో ఒకటి , ఊరు దాటాక ఒకటి ఉన్నాయి . మొదట్లో ఉన్న దారి "పాల రేవు " కు తీసుకెళ్లగా రెండవ దారి "బండి రేవు " కు తీసుకుపోతుంది.  పై రెండు చిత్రాల్లో గోదారి నిలకడను , అలాగే గోదారి పరవళ్ల ను చూడవచ్చును .  సముద్ర తీరాలను తలపించే ఇసుక తిన్నెలు గోదారి తీరానికి ఎంతో అందాన్ని తెచ్చాయి .  "నేతి గుండం" అని పిలువబడే ఈ నీటి నిలువలు రాతి గుట్టల పై పది అడుగుల ఎత్తున ఎండి పోకుండా ఉండడం విశేషం . నేతి లాగ నూనె నూనె లా ఉండడమే ఈ గుండానికి ఆ పేరు

ప్రతీ సంవత్సరం గ్రామం లో ఘనంగా జరిగే దుర్గా శరన్నవ రాత్రి ఉత్సవాలు.(2011)

Image
   నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యం లో అమ్మవారి నవ రాత్రి ఉత్సవాలు జరుగుతాయి . సంఘ సభ్యులు భావాని దీక్షలు తీసుకుని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు .  అమ్మవారి మంటపం లో కలశ స్థాపన   రాత్రి వేళల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు .  అమ్మవారి నిమజ్జనం రోజు మహిషాసుర మర్దనం కార్యక్రమం లో మహిషాసురుని పేల్చివేస్తారు .  నిమజ్జనం రోజా గ్రామ వీధుల గుండా అమ్మవారి శోభాయాత్ర ఉంటుంది.

గ్రామం లోని పాత పోస్టాఫీసు మరియు గతం లో పాటశాల గ కూడా ఉన్న భవనం

Image
 1970  నుండి ఈ భవనం పోస్టాఫీసు గా ను మరియు గ్రామ పాటశాల గాను ఉండేది . 1982 లో ప్రస్తుత నూతన భవనం లోకి పాటశాల మారినది . పై  భవనం ముందే గ్రామం లో మంచినీటి కోసం తొలిసారి నిర్మించిన ఒవర్ హెడ్ ట్యాంక్ ఉంది . దీనిని  60000 లీటర్ల సామర్ధ్యం తో 1991-92 లో నిర్మించారు .

గ్రామ తెలంగాణ మహా ర్యాలీ లో "అస్సోయ్ దూల హారతి ..." ధూమ్ ధాం ఆటా పాటా

Image

మొగిలిపేట లో తెలంగాణ సకల జనుల సమ్మె కు మద్దతు గా మహా ర్యాలీ - గ్రామ జే ఏ సి కార్యక్రమం

Image
 గ్రామం లోని పిల్ల పెద్ద , మహిళలు , రైతులు , సకల జనులంతా తేది . 22.9.2011  రోజున మహా ర్యాలీ ని ఇలా ప్రారంభించారు .  బొడ్డేమ్మ మరియు బోనాలతో మహిళలు .    గ్రామ వీధుల గుండా కదులుతున్న జన వాహిని .  బైటాయించిన మహిళలు , తెలంగాణ తల్లి వేషధారణ లో చిన్నారి .  గ్రామ వీధుల నిండా సందడే సందడి ... జై తెలంగాణ నినాదాలతో వీధులు  దద్దరిల్లాయి .  చిన్నారు లేమి తక్కువ కాదు ... హుషారుగా నర్తిస్తూ ర్యాలీ కి అగ్రభాగాన ఉన్నారు . ఉద్యమం లో అగ్రభాగాన ఉంది గ్రామ గ్రామా న చైతన్య యాత్రలతో ఉద్యమ జ్వాల రగిలిస్తున్న ఉపాద్యాయులను ఘనంగా సన్మానిస్తున్న గ్రామస్థులు .  రోడ్డు పై బైటాయించి నిరసన తెలుపుతున్న గ్రామస్థులు .

మొగిలిపేట లో సద్దుల బతుకమ్మ - తెలంగాణ ఉద్యమ స్పూర్తి తో కార్యక్రమం

Image
గ్రామం లోని పిల్లలు , మహిళా లోకం తెలంగాణ స్పూర్తి తో కదలి  వచ్చి నినదిస్తున్న దృశ్యం .   బతుకమ్మ పై తెలంగాణ జెండా ఉంచి తెలంగాణ ఆకాంక్షను ప్రకటిస్తున్న గ్రామస్థులు . బతుకమ్మ తో గ్రామ జే ఏ సి నేతలు .