Posts

Showing posts from August, 2010

మన పంటపొలాల్లో వానపాములు - బుర్కబెడ్డలు కనబడుతున్నాయా ! చూడండి.

Image
                                                మన గోరటి ఎంకన్న రాసిన "పల్ల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల " అనే పాటలో ఒక దగ్గర ఇలా అంటాడు  ...                         " తొలకరి జల్లు కు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయేర వాన పాములు నత్తగుల్లలు భూమిల ఎందుకు బతుకుత లేవు - పత్తి  మందుల గత్తర వాసన రా ఈ పంట పొలాలల   ...... "                               నిజంగానే మన పంట పొలాల్లో నేడు వానపాములు , నత్తగుల్లలు , బుర్కబెడ్డలు మాయమైనాయి . ఎరువులు, మందుల  వాడకం వల్ల  వాటి కోసం గాలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా గాలించగా కనిపించిన  వాన పాములు  - బుర్కబెడ్డలు చూడండి. పై చిత్రం లో  వాన పాము - బుర్కబెడ్డల్ని చూడవచ్చు. మందు కూడు లేని మంచి రోజు కోసం మనమంతా ప్రయత్నాలు మొదలెడుదాం లెండి !                                                                 

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

Image
                                        వర్షాలు ఆరంభం కాగానే శ్రావణం లో అలా పొదలపై వాలి కనిపిస్తుంటాయి ఈ కాకరకాయ తీగలు. చూడగానే ముద్దొచ్చే బోడ శరీరం తో ఆకర్షిస్తుంటాయి. సీజనల్ రుచి లో నంబర్ వన్ కాయ గాబట్టే దీనికి డిమాండు ధర అన్నీ ఎక్కువే ...! అడవికి వెళ్తే గాని దొరకదు ,...!                                    ఇంత డిమాండ్ వుంది కదా మనమే ఓ పంటేసి పండిస్తే పోలా ...! అనుకుంటే కుదరదు ఎందుకంటే అన్నీ కాలాల్లో కాత ఆగదు, ఆగినా నిలవదు , పురుగు పట్టేస్తుంది. అదీ దీని ప్రత్యేకత ...!         అందుకే ఇది మణి కిరీటం అనేది ....! చలో అడవికి పోదాం పదండి ....! ఇవీ మగ పొదలు మనకు పూతను మాత్రమే  ఇస్తాయ్ ...కాబట్టి ఈజీ గా గుర్తుపట్టచ్చు !  ఈ రెండూ పొదలూ ఆడపొదలండోయ్..... పూత,  పూత వెంబడి  కాత అంటే కాయలనిస్తాయ్.... ! సేకరించిన కాయలు ..... వండేయండి మరి......! పైన  రెండు చిత్రాల్లో మొదటిదాంట్లో పండిన కాయ అలాగే రెండో దాంట్లో పండి పగిలిన కాయని చూడవచ్చు. పగిలిన కాయనుండి రాలిన విత్తనాలు మల్లి మొలకెత్తుతాయి .   

పొంగి ప్రవహిస్తున్న మొగిలిపేట మత్తడి

Image
చాలా రోజుల తరువాత సుమారు పది సంవత్సరాల తర్వాత మన చెరువు మత్తడి పై నుండి వరద ప్రవహిస్తోంది. దీని కారణంగా తూం విడవకుండానే చెరు కింద నీటి పార్కం కలిసొచ్చింది.  మత్తడి నుండి వస్తున్నా నీటి ప్రవాహం.

మన గ్రామం లో దేశ నాయకుల బొమ్మలు

Image
                                        మన గ్రామం లో మహనీయుల విగ్రహాల ను నిలపడం 1977 లో ప్రారంభమయ్యింది . అప్పుడు పెద్దబాపు కే.వి రాజేశ్వర్ రావు , నడిబ్బాపు సుధాకర్ రావు , మరియు శాస్త్రి యువజన సంఘం సభ్యులు గోల్కొండ సీతారాం , విద్యాసాగర్ , అంకతి పెద్ద రాజన్న , మసుల పెద్ద రాజన్న మొదలగు వారు వాటిని చేయించి తెచ్చి ప్రధాన కూడళ్ళలో నిలబెట్టారు .                                                                          ఇది గాంధీ బొమ్మ ఎర్రగడ్డ లేదా గాంధీ వాడ లో ఈ బొమ్మ వుంది.  దీన్ని నిలబెట్టిన తరువాత అప్పటి ఆ వాడ యువకులు గాంధీ బాల సంఘం పేరు తో ఒక యువజన సంఘాన్ని ప్రారంభించుకొన్నారు. ఇప్పటికి అది వుంది. ఇది యుద్ద సేనాని నేతాజీ బొమ్మ . ఊర్లో చాలా మంది నిరక్ష్య రాస్యులు పలకరాక తెలవక గుఱ్ఱం బొమ్మ అనికూడా పిలుస్తారు. ఇది దుబాయ్ దాతల చేత నాటి సర్పంచ కీ.శే. శ్రీ చెట్లపెల్లి చిన్ననర్సాగౌడ్ మరియు గ్రామ ప్రజల విరాళాల ఆధారంగా నెలకొల్పారు. ఇది గ్రామ పంచాయతి వద్ద కూడలి లో నెలకొల్పారు. ఈ బొమ్మను 1977 లో నెల కోల్పారు . ఇది కూడా శాస్త్రి యువజన సంఘ ఆధ్వర్యం లో తీసుకరావడం జరిగింది. రాజ్యాంగ నిర్

ఎడ్లు నెమరు వేస్తున్నాయి...మనమూ వేద్దాం రండి...! వీడియో

            ఎడ్లు, బర్లు నెమరు వేస్తుంటాయి. అలాగ.... వాటిని చూస్తూ కూర్చుంటే ఎంత బాగనిపిస్తుందో..!  అవి వాటి ఆహారాన్ని నేమరువేస్తాయి .....మనం అప్పుడప్పుడు మన జీవితాన్ని నెమరు వేద్దాం రండి  !

వార్త - మొగిలిపేట చెరువుకు భారీ వరదతో గండి

Image
                  మన మొగిలిపేట చెరువుకు భారీ వర్షాల వల్ల వచ్చిన వరదనిటితో భీమన్నగుడి సమీపంలో పెద్ద గండి ఏర్పడింది. చెరువు లోని మట్టి కోసం వేసవి లో  ట్రాక్టర్స్ ఎక్కువగా అక్కడినుండే రాకపోకలు సాగించడం  వల్ల  అక్కడే గండి పడింది. గ్రామ పెద్దలు గండిపూడిక కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.  వేసవి లోనే   తోవను మట్టిపోసి బలంగా చేస్తే విలువైన నీరు  వృధాగా పోయేది కాదు. పంటనష్టం జరిగేదికాదు.

గిజిగాడి అల్లిక లో ...ఎంత ఇంజనీరింగో ... అల్లుతున్నాడు పదండి...చూద్దాం ...!

Image
గిజిగాడి పై మనసుపడి  గుఱ్ఱం జాషువా గారు అల్లిన వాక్యాలు ........... తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! పచ్చపిట్టె  గూడు ఎంత సుందరమో ....! మా ఇంటి వెనకాల ఇలా తన పనిలో బిజీ గా దర్శనమిచ్చాడు మన గిజిగాడు ....!

కడుపు నిండా నీటి తో మన చెరువు

ఎండి నిండిన మన చెఱువు ... బ్రతికిపోయాం !

Image
         వేసవి లో నేర్రలీనిన మన చెరువు.  మొత్తం నీటిని మన పెద్దమనుషులు వృధాగా వదిలేసిన కారణంగా గత వేసవి లో తీవ్ర నీటి ఎద్దడి ని ఎదుర్కున్నాం . చెరువు మొత్తం ఎండి ఎండి ఊరి భూగర్భ నీటి మట్టాన్ని ప్రభావితం చేయడం తో జనం నీటి కోసం మన గ్రామ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా పరుగులు పెట్టారు.లక్షలాది డబ్బు ఖర్చు తో బోర్లు వేయాల్సి వచ్చింది. నీటి విలువ ఏమిటో  ఇప్పుడు అనుభవం లోకి వచ్చింది.. ప్రస్తుతం నీటి తో కళకళ లాడుతున్న చెరువు. ఆ గంగమ్మ తల్లి కృప వల్ల మళ్లీ వానలు విస్తారంగా కురవడం తో చెరువు నిండా నీటి తో సింగారించుకుని వచ్చి పోయే వారికి కనువిందు చేస్తోంది. ఇక మనం చాలా చాలా జాగ్రత్తగా నీటి వినియోగం చేసుకోవాల్సి వుంది. ఇంకా నీరు చెరువు లోకి చేరుతూనే వుంది.