Posts

Showing posts from March, 2014

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం - గ్రామస్థుల్లో నూతనోత్సాహం

Image
కార్యక్రమ వివరాలు   స్వస్తి శ్రీ విజయనామ సంవత్సర మాఘ బహుళ విదియ రోజున ... తేది : 17/2/2014  సోమవారం నుండి 20/2/2014 వరకు కార్యక్రమం జరిగింది. శాశ్వత ఆలయ ధర్మ కర్త గా శ్రీమాన్ శ్రీ కల్వకుంట్ల రాజేశ్వర్ రావు గారు మరియు శ్రీమతి కల్వకుంట్ల సరళ దేవి గారు ముందుండి కార్యక్రమ నిర్వహణ గావించారు . గ్రామ స్థాయి లో గ్రామ అభివృద్ధి కమిటి , గ్రామ దేవాలయ కమిటి మరియు భక్తులు ప్రజలు కలిసి దిగ్విజయం గావించారు. 17/2/2014 రోజు సోమవారం రోజు ... ఉదయం 9.15 గంటలకు ప్రతిష్టా మూర్తుల శోభాయాత్ర గ్రామ వీధుల్లో బ్రహ్మాండంగా జరిగింది. మాతలు భక్తులు మంగళహారతులతో ఎదురెల్లి స్వాగతం పలికారు. అనంతరం 11 గంటలకు స్వస్తి పుణ్య వచనం రక్షాబంధన దీపారాధన , ఆచార్య రుత్విక్కరణం జరిగాయి. మంటపారాధన, కుంభ స్థాపనము తరువాత తీర్థ ప్రసాద వినియోగం తో మొదటి రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసాయి.  18/2/2014 తదియ మంగళ వారం రోజు .... ఉదయం 6 గంటలకు సుప్రభాతము 9 గంటలకు గత స్థాపిత దేవతార్చన దివ్య ప్రభంద పారాయణం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది. మంటపారాధన, అగ్ని ప్రతిష్ట , నిత్య హోమము , స్థాపిత దేవత హోమాలు ,