అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం - గ్రామస్థుల్లో నూతనోత్సాహం



  • కార్యక్రమ వివరాలు 
  • స్వస్తి శ్రీ విజయనామ సంవత్సర మాఘ బహుళ విదియ రోజున ...
  • తేది : 17/2/2014  సోమవారం నుండి 20/2/2014 వరకు కార్యక్రమం జరిగింది.
  • శాశ్వత ఆలయ ధర్మ కర్త గా శ్రీమాన్ శ్రీ కల్వకుంట్ల రాజేశ్వర్ రావు గారు మరియు శ్రీమతి కల్వకుంట్ల సరళ దేవి గారు ముందుండి కార్యక్రమ నిర్వహణ గావించారు .
  • గ్రామ స్థాయి లో గ్రామ అభివృద్ధి కమిటి , గ్రామ దేవాలయ కమిటి మరియు భక్తులు ప్రజలు కలిసి దిగ్విజయం గావించారు.
  • 17/2/2014 రోజు సోమవారం రోజు ...
ఉదయం 9.15 గంటలకు ప్రతిష్టా మూర్తుల శోభాయాత్ర గ్రామ వీధుల్లో బ్రహ్మాండంగా జరిగింది. మాతలు భక్తులు మంగళహారతులతో ఎదురెల్లి స్వాగతం పలికారు. అనంతరం 11 గంటలకు స్వస్తి పుణ్య వచనం రక్షాబంధన దీపారాధన , ఆచార్య రుత్విక్కరణం జరిగాయి. మంటపారాధన, కుంభ స్థాపనము తరువాత తీర్థ ప్రసాద వినియోగం తో మొదటి రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసాయి. 
  • 18/2/2014 తదియ మంగళ వారం రోజు ....
ఉదయం 6 గంటలకు సుప్రభాతము 9 గంటలకు గత స్థాపిత దేవతార్చన దివ్య ప్రభంద పారాయణం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది. మంటపారాధన, అగ్ని ప్రతిష్ట , నిత్య హోమము , స్థాపిత దేవత హోమాలు , క్షీరాదివాస హోమము , బలిహరణము తీర్థ ప్రసాద వినియోగం తో రెండవ రోజు కార్యక్రమం ముగిసింది. ఈ రోజు విగ్రహాల ను నీటి లో నానా వేశారు .
  • 19/2/2014 చవితి బుధవారం రోజు ....
 ఉదయం 6 గంటలకు సుప్రభాతము 9 గంటలకు గత స్థాపిత దేవతార్చన నిత్య హోమము ప్రాణ ప్రతిష్టా హోమము సార్వ దైవిక హోమము షోడశ కళాన్యాసాలు హోమము వాస్తు హోమము దేవాలయ పరియగ్నీకరణము తరువాత తీర్థ ప్రసాద వినియోగం జరిగినది. 
సాయంత్రము 4 గంటలకు దాన్యాదివాస హోమము 6 గంటలకు లక్ష్మి పూజలు బలిహరణం తరువాత తీర్థ ప్రసాద వినియోగం తో కార్యక్రమం ముగిసింది.
  • 20/2/2014 పంచమి గురువారం రోజు ...
ఉదయం 3 గంటలకే గ్రామ పెద్దమనుషులు భక్తులు ప్రజలు ధర్మకర్త అంతా చేరుకున్నారు . సుప్రభాతం తరువాత 3-28 నిమిషములకు యంత్ర మూర్తి ప్రతిష్టాపనము కనుల పండువగా జరిగినది. నేత్రోల్మినలినము , బలిహరణం , జయాది హోమము ప్రాయశ్చిత్త హోమము తరువాత పూర్ణాహుతి కుంభాభిషేకము జరిగాయి. కుంభాభిషేకము లో భక్తు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం శాంతి కల్యాణం జరిగినది.
మొత్తం నాలుగు రోజుల కార్యం అవిఘ్నంగా పూర్తయ్యింది. జీవితం లో అదీ మా స్వగ్రామం లో ప్రతిష్టా మహోత్సవం చూసే భాగ్యం దొరికినది . ఆ అవకాశాన్ని కలిగించినవెంకన్న కు నమస్సులు.

Comments

  1. meeru ramadamdandu anu google group lo cheraalani manavi

    mee amil adress pampagalaru

    durgeswara@gmail.com

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట