Posts

Showing posts from August, 2011

ఘనంగా జరిగిన పెద్దమ్మ తల్లి జాతర - మళ్లీ ఐదేళ్లకు పునర్దర్శనం

Image
మా గ్రామం లో  ప్రతీ ఐదేళ్లకు ఒక సారి పెద్దమ్మ తల్లి జాతర జరుగుతుంది . సుమారుగా  తెలంగాణా గ్రామా లన్నింటిలో ఇలాగే ఆనవాయితీ ఉంది . గ్రామ కుల సంఘాల సమితి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరుగుతుంది. తేదీ  8.5.2011 ఆదివారం రోజున జాతర జరిగింది .   అమ్మ  వారిని రంగులతో అద్దడానికి గ్రామ శివారుల్లో ఒక పందిరి వేసి అక్కడికి తీసుకెళతారు. ఈ సారి కోటకాల్వ మామిండ్ల లో అద్దకం కార్యక్రమం ఏర్పాటు చేశారు . అద్దకాని కి వారసత్వంగా పని చేసే నకాయిషీ లు రంగులు అద్దుతారు . అద్దకం పూర్తీ అయ్యాక గ్రామస్తులంతా వెళ్లి అమ్మవారిని ఘనంగా దేవాలయానికి ఎదుర్కొంటారు . ఇట్టి కార్యక్రమం లో " ద్యావతి " వాండ్ల విన్యాసాలు గ్రామస్తులను బాగా ఆకర్షిస్తాయి . కాని ఈ సారి అంత చెప్పుకోదగ్గ విన్యాసాలు ఏమి ప్రదర్శించ లేకపోయారు . ఎదుర్కోలు సమయం లో కోళ్ళ మేడలు విరిచి పాడేయడం, కోడి గ్రుడ్లను తింపి విసరడం ...వల్ల అమ్మ వారి కోపం చల్లారుతుందని విశ్వసిస్తారు. మహిళలు దారి పొడుగునా మంగళ హారతులతో స్వాగతం చెపుతూ కొబ్బరికాయలు కొడతారు . ఈ విధంగా అమ్మవారి ఉరేగింపు సాగుతుంది.  అమ్మ వారి పండుగ చేయడం వల్ల గ్రామం ఎలాంటి రోగాలు

పుల్చెరి చెట్టు పండ్ల తో పెన్ను లోకి ఇంకు తయారు చేసేవాళ్ళం ... ఆ కాయలు తినేవాళ్ళం ..నోరు నల్లబడేది ...చూడండి .

Image
పుల్చేరి కొమ్మ ఆకు ఏంతో అందంగా ఆకుల వరసను కలిగి ఉంటుంది. వాటికాయలు అంటే పళ్ళు నల్లగా మెరుస్తూ నోరూరిస్తుంటాయి . పెన్ను లో సిరా ను ఇంటి వద్దే తయారీకి వీటిని బాగా వాడే వాళ్ళం. అంతే కాదు స్కూల్ లో నల్ల బల్ల కు రుద్దడానికి కూడా ఇదే తెచ్చి దంచి వాడే వాళ్ళం . ఇప్పుడు వాటి ఊసు లేదు ... అంతా డిజిటల్ బోర్డ్ ల మయం .                         ఇవి పుల్చేరి ఆకులు .   పుల్చేరి  పండ్లు ..ఇవే ఇంకు తయారీ కి వాడేవి ..తినేవీ ను. ఇంకా దగ్గర గా పుల్చేరి కాయ ను పండును చూడవచ్చును.

సీతాఫల పుష్పం - లేత పింద - మా చెరువు కట్ట కు చూడముచ్చటైన సీతాఫల వనం .

Image
చిన్న నాటి నుండి ఒకటి తెలుసు ... అదేమంటే మా చెరువు కు  స్నానం కు వెళ్లి నప్పుడల్లా కట్ట మీద సీతాఫల చెట్ల కు ఈ సీజన్ లో కాసే  వాటి పుష్పాలు వాటి పిందెలు ...  ఎప్పుడు గుడ్లు తెరుస్తాయా అని ఎదిరి చూసీ చూసీ గుడ్లు తెరవగానే వాటిని తెంపి అక్కడే మక్కేసే వాళ్ళం. మక్కె దాకా రో జూ తరచి తరచి చూసేవాళ్ళం. మొత్తానికి గంటలు గంటలు ఆ సీతాఫల వనాల్లో నే గడిచేది . ఇప్పటికీ అదే ధ్యాస వ్యాపకం ....! తాజా  తాజా సీతాఫల పుష్పం .   కొమ్మల్లో నక్కిన అందమైన  సీతాఫల లేలేత కాయ .

తోటల్లో బుర్కబెడ్డల సందడి షురూ ...!

Image
ఉదయం అలా తోట్లో  కి వెళ్ళగానే ముద్దు గా రైతును పలకరించే తడి మట్టి బెడ్డల్నేబుర్క బెడ్డలు అంటారు . ఇవి వాన పాముల వల్ల తయారవుతాయి. చేనుకు బలంగా సారవంతం చేస్తాయి కూడా . పిల్లలకు వీటి తో ఆడుకోవడం మహా సరదా . ఈ మధ్య నేను ఓ తోటలోనికి వెళ్ళినపుడు ఇవి దర్శనమిచ్చాయి . మొక్కజొన్న దంట్ల నడుమ అందంగా మెరిసి పోతున్నాయి .   మెరిసిపోతున్న  బుర్కబెడ్డ ...!   ఇలా  తోట నిండా అవే ..! ఐతే నేటి ఎరువుల మూలాన చాలా చోట్ల వీటి దర్శనం కరువవుతోంది .