Posts

Showing posts from September, 2010

కోలాటం - మొగిలిపేట లో భక్తి ప్రపత్తులతో నిమజ్జనం - వీడియో.

                                   మొగిలిపేట వినాయక నిమజ్జన ఉత్సవాలు మన గ్రామం లో ఉత్సాహంగా జరిగాయి . ఆది , సోమవారాల్లో నిర్వహించారు . కోలాటం , భజన గీతాలు , యువకుల నృత్యాలతో శోభాయాత్ర సాగింది .                         గణనాథా ఇక సెలవు ... మా గ్రామాన్ని చల్లగా చూడు తండ్రి .                  కోలాటం గ్రామ పెద్దమనిషి శ్రీ. మాసుల రాజగంగారాం గారి ఆధ్వర్యం లో జరిగింది . ఇందులో శ్రీయుతులు బంటు హన్మాండ్లు ,మాసుల పెద్దిరెడ్డి, ఏసురత్నం , మసుల వినోద్ , గాజుల పెద్ద గంగారెడ్డి , గాజుల చిన్నారెడ్డి , ఎనడ్ల రాములు , రెబ్బస్ కొమురయ్య , మాసుల  చిన్నయ్య , వరద ఆశన్న , గోల్కొండ లింగారెడ్డి, మామిడి తుక్కన్న , మామిడి సత్తయ్య ,  మొదలగు వారు పాల్గొన్నారు.

ఇది గురివి తీగ అలా వేస్తే చాలు ఇలా చెట్టు ను కనబడకుండా చుట్టేస్తుంది ....!

Image
ఇది పల్లెల్లో సహజంగా కనిపించే పొద తీగ ...!                                                               దీని పేరు గురివి తీగ ...దీని ప్రత్యేకత ఏమంటి పచ్చగా వున్న ఏ పొద చెట్టు పైన దీన్ని అలా వదిలితే చాలు ...అలా అలా రోజుకో తీరున అల్లుకు పోతుంది . చూస్తుండే లోగా ఆ చెట్టును కప్పేస్తుంది . దానితో సరదా గా పిల్లలు ఈ చెట్టు మీది నుండి ఆ చెట్టు పైకి , ఆ పొద నుండి ఈ పోదకు వేస్తూ ఆడుకుంటారు ...!                                                        భలే ఉంది కదూ ...!              ఈ ఫోటో మొన్న  మా చెరువు తెగక పూర్వం ..... కట్టి కింద ఆ తెగిన ప్రదేశం లోనే తీసింది ...అక్కడ ప్రస్తుతం ఏ ఆనవాలు లేదు .... BAD.

మన పాత హనుమాండ్లు.... అదే వీరనుమాండ్లు ....!

Image
                        ఈ హనుమాండ్లు చాలా ఏళ్లక్రితం మన పాత బ్యాంక్ అంటే పెద్దబాపు బంగ్లా ముందు బంటోల్ల రాయి మీద ఉండేది. అక్కడ అప్పటికే రాయేషుడు ఉన్నందున ...సుమారు 1981 లో అనగా 29 ఏళ్ల క్రితం స్వర్గీయ గోల్కొండ సీతారాం , టెక్స్ నర్సయ్య , లింగాల రాజన్న ఆధ్వర్యం లో ఇక్కడి నుండి తీసుకెళ్ళి గంగులోల్ల ఇంటి పక్కన ప్రతిష్టింపజేశారు. అనంతరం ఒక మఱ్ఱి మొక్కను అక్కడ నాటారు. అదే ఇపుడు మంచి వృక్షం అయ్యింది. అక్కడి స్థానిక వాడకట్టు వాళ్ళు దాని బాగోగులు చూస్తున్నారు. జై శ్రీ రాం ! వీర హనుమాండ్లు . అక్కడి వాడ వాళ్ళు ఏర్పరిచిన కప్పనం . అక్కడి మఱ్ఱి ...సాయంత్రం కాగానే అక్కడ ఆటలతో పిల్లల సందడి వుంటుంది.

మొగిలిపేట్ వద్ద మలుపు తిరుగుతూ తన పరవళ్ల తో మైమరిపిస్తున్న గోదారి - పాలరేవు.

                                                గోదారమ్మ సరిగ్గా మొగిలిపేట్ వద్దనే మలుపు తిరిగి వెళుతుంది. వెళుతూ వెళుతూ రెండు గా చీలుతుంది. ఈ చీలికలు మరో పది కిలోమీటర్లు ప్రయాణించి దామ్రాజ్ పల్లి వద్ద కలుసుకొని వాల్గొండ శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద విశాలంగా అగుపిస్తుంది. అలా మా గ్రామం వద్ద మలుపులో తన పరవళ్ల తో ఆకట్టుకొంటున్న గోదారి హోరు ను వింటూ చూడండి.

మన గ్రామ పంచాయతి భవనం

Image
ఇది మొగిలిపేట గ్రామం లోని గ్రామ పంచాయతి భవనం . ఎప్పుడు ఉదయం సాయంత్రం జనం తోని కళ కళ లాడుతుంటుంది. అక్కడే బస్ స్టాప్ గనక వచ్చి పోయే ప్రయాణీకుల తాకిడి ఉంటుంది. గ్రామ పంచాయతి భవనము . మొదటిది సర్పంచ్ గడి - రెండవది సమావేశ మందిరము.

పోచంపాడ్ ప్రాజెక్ట్ నీరు వదిలారు .. సందర్శకుల తాకిడి పెరిగింది ... నీటి హోరు చూడండి.

                 పోచంపాడ్  ప్రాజెక్ట్  మాకు నీరు అందించే జలాశయం. ప్రస్తుతం దీనిలోకి  విపరీతమైన వరదనీరుచేరడం తో  నీటి నిలువ గరిష్ట స్థాయిని దాటింది . 34 గేట్లను ఎత్తారు .పరవళ్ళు త్రోక్కుతున్న నీటి హొయలు చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు .

మంగలి లింగన్న పాములాట ...! ఊర్లో అందరికి ఆప్త బంధువు ...!

Image
                           మంగలి లింగన్న ... ఆ పేరు చెబితే చాలు పిల్లలు మారాం మానేస్తారు. చెప్పింది చేసేస్తారు ..తినుమంటే తినేస్తారు...పడుకోమంటే పడకేస్తారు...! ఊర్లో అందరికి నోట్లో నాలిక లా.... పాము కనబడితే చాలు లింగన్న కు కబురు వెళుతుంది. అతను వచ్చిండు అంటే చాలు ... పాము దొరికినట్టే ...! అతను పెంచి పోషించని జంతువూ లేదు గుఱ్ఱం , కుక్కలు, కొల్ల కాడికేల్లి అన్నింటిని ఎంతో ఆపేక్ష గా పెంచుతాడు .ఇక పాములైతే సరే ..సరి. అమ్మో లింగన్న ...! అరే పట్టుకో ...పట్టుకో....! ఇదిగో వీడు పట్టేశాడు ...వీడికి పామంటే భంయం  లేదు ...! నాగరాజు తో పటేల్ యూత్ సభ్యులు ......!

బాదనకుర్తి బ్రిడ్జ్ వద్ద వరద గోదారి పరవళ్ళు .....!

                                           ఇటీవలే ప్రారంభమైన బాదనకుర్తి వంతెన వద్ద గోదారి పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తోంది. మా మొగిలిపేట గ్రామానికి ఇది మూడు కిలోమీటర్ల దూరం లో వుంటుంది. వచ్చి పోయేవారిని అమితంగా ఆకర్షిస్తోంది.

మొగిలిపేట లో కొలువుదీరిన గణనాధులు ...!

Image
            మన గ్రామం లో ఈ సంవత్సరం వివిధ యువజన సంఘాల ఆధ్వర్యం లో వివిధ వాడల్లో పలు రూపాల్లో విఘ్నరాజు దర్శనమిచ్చి భక్తుల ను ఆకట్టుకుంటున్నాడు . తండ్రి విఘ్నరాజా ఈ ఏడు నీ చల్లని చూపు మా పై వుంచి మమ్ము ఆదుకొమ్ము గణనాధా......!                                                                 ఓం గణేశాయనమః ! బాల సంఘం ఆధ్వర్యం లో మన హనుమాండ్ల గుల్లె కొలువైన బొజ్జ గణపయ్య .  దొరగారి గద్దె వద్ద పటేల్  యూత్ ఆధ్వర్యం లో ఆసీనుడైన విఘ్నరాజు . గాంధి నగర్ ( ఎర్రగడ్డ ) లో సింహం పై దర్శనమిస్తున్న గణనాథుడు . బస్ స్టాండ్ సమీపం లో YSA ఆధ్వర్యం లో ఆసీనుడైన గణాధిపతి . ఒడ్డెర బస్తీ లో దర్శనమిస్తున్న భజన స్థితి లో  వినాయకుడు. గంగపుత్రుల ఆధ్వర్యం లో కొలువైన లంభోదరుడు . పురగిరి క్షత్రియ ( పెరిక ) యువజనుల ఆధ్వర్యంలో కొలువైన ఓంకార్ గణేశుడు. ఇంకా మరిన్ని ఫోటోలు :                            శుభమస్తు .

మొగిలిపేట లో JAC ఆధ్వర్యం లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.

Image
                     మొగిలిపేట ముందునుండి వివిధ ఉద్యమాలకు పోరాటాలకు పెట్టింది పేరు. అలానే తెలంగాణ ఉద్యమం లో గూడా చాలా చురుకైన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ధూమ్ ధాం ను నిర్వహించింది. తన గ్రామం లోనే గాక ఇక్కడనుండే మల్లాపూర్ మండల ఐఖ్య కార్యాచరణ సమితి ( MANDAL JAC ) కన్వినర్ గా వున్న నాగుల రమేష్ ఆధ్వర్యం లో మండలం లోని అన్ని  గ్రామాల్లో విమోచనోత్సవాలు జరిగాయి. మెట్పల్లి లో ఆత్మహత్యలు వద్దు అంటూ కరపత్ర వితరణ జరిగింది.           మన గ్రామం లో గ్రామా JAC కన్వినర్ వంగ శేకర్ ఆధ్వర్యం లో గ్రామ పంచాయతి సమీపం లో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది . అనంతరం గ్రామ యువకులు , విద్యావంతులు , పాటశాల విద్యార్థుల ఆధ్వర్యం ర్యాలి బయలు దేరి గ్రామం మొత్తం చుట్టి వచ్చి పటేల్ యూత్ వినాయకుని వద్ద మరొక పతాక ఆవిష్కరణ యూత్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి ఆధ్వర్యం లో జరిగింది.                                    ఈ కార్యక్రమంలో నాగుల రమేష్ , వంగ శేకర్ , బాపుస్వామి, గోల్కొండ పవన్ , ప్రమోద్ తదతరులు పాల్గొన్నారు. పతాకావిష్కరణ లో శేకర్...    మువ్వన్నెల జండా రెపరెపలు...... పటేల్ యూత్  వద్ద విమోచన దినోత్సవం ....

మా ఊరి మసీదు మరియు చిన్న దర్గా .

Image
                                              గ్రామం లో ఒకప్పుడు పాత మసీద్ ఇదే స్థానం లో వుందేడిది. అది శిథిలావస్థకు రావడం తో కొత్తగా దీనిని నిర్మించారు . అలాగే 30 ఏళ్ల క్రితం  ఒక చౌకిదార్ మా గ్రామం లో పని చేస్తున్న కాలం లో ఒక చిన్న దర్గాను నిర్మించాడు . ఈ మసీదు ఆధారంగా గ్రామం లో పీరీల పండుగ జరుపుతారు . గ్రామస్తులంతా మత కుల భేదం లేకుండా పాల్గొని మొక్కులు చెల్లించు కుంటారు . సంబంధిత భక్తులకు పూనకం వస్తుంది . వారితో భక్తులు భూత భవిష్యత్తు వారి వారి సంశయాల గురించి మాట్లాడతారు. మంత్ర తంత్రాల తో బాధ పడే భక్తులు ఆ రోజు పూనకం వచ్చిన దేవునితో అగ్ని గుండం లో నుంచి నడుస్తారు . అలా చేయడం రోగం పోతుందని విశ్వసిస్తారు. నెమలి కట్ట తో వీపు ల మీద బాదడం పూనకం వచ్చిన వ్యక్తి చేసే సాధారణ క్రియ. ఇలా పండగ లో అందరూ పాల్గొని విజయవంతం చేసి ఉరేగింపుగా వెళ్లి పీరీలను నిమజ్జనం చేస్తారు. పిల్లా పాపలతో కలిసి ఈ పండగలో అందరూ పాల్గొంటారు. చాలా మంది వారి వారి మొక్కుల కు అనుగుణంగా పులివేషాలు , సాయబుల వేషాలు, బాలింత, లాంటి వింత వింత వేషాలు వేసి అలరిస్తారు. చిన్న పిల్లలకు ఎంతో ఆనంద అందించేపండగ ఇది.పండగకు పది రోజుల ముంద

బ్రాహ్మం గారు చెప్పినట్లు ఈ " వెంపలి చెట్ల "కు నిచ్చనలేద్దామా !?

Image
ఇవేననండీ మన బ్రాహ్మం గారు చెప్పిన వెంపలి చెట్లు . వీటికే రాబోయే రోజుల్లో మానవుడు నిచ్చెనలు వేసిది . నమ్ముదామా ! "నందామయ గురుడ నందామయ బ్రాహ్మం గారు చెప్పింది వేదామయా" 

మా ఇంటి గణపతి ... మట్టి గణపతి ...మహా గట్టి గణపతి.

Image
      మా ఇంట్లో ప్రతీ సంవత్సరం లాగే ..చవితి రోజున లంభోదరుడు కొలువైనాడు . నాటి పద్దతి లోనే నల్లని మట్టి తయారీ లో మెరిసిపోతున్నాడు . ఆ బోర్రయ్య టో మా శివుడు .... తండ్రి - కొడుకుల ముచ్చట తీర్చుకుంటున్నాడు ..చూడండి. బోలో గణేష్ మహారాజ్ కి జై ! బోలో మూషికవాహన్ కి జై ! మా శివుడు ... ఆ లంభోదరుడు ...!

హనుమాన్ మందిరము - మన ఊర్లో మొదటి గుడి.

Image
                             మన గ్రామం లో హనుమాన్ మందిరం 1970 కి ముందే దొరల కాలం లో నిర్మాణం చేయబడింది. అపుడు ఈ ప్రహారీ ఏమీ లేదు . కేవలం గుడి చుట్టూ ఏమీ రక్షణ లేక చెత్త చెదారం తో వుండేది.దాని చుట్టూ గోడ నిర్మించాలనే ఆలోచన తో ఆనాటి శాస్త్రి యువజన సంఘం అందులో శ్రీ గోల్కొండ సీతారాం గారి ప్రత్యేక చొరవ తో నిర్మాణం పూర్తీ అయ్యింది. అనంతరం ప్రతి శనివారం భజన తప్పక ఉండేది . గంగుల రాజగంగారాం , తులసీ దాస్ లాంటి వాళ్ళు చక్కటి భజనలు చెప్పేవారు. విశేషం ఏమంటే భజనలన్ని కూడా మన ప్రాంతం లోని కోరుట్ల , మెట్పల్లి వాస్తవ్యులు రాసినవి మన యాస లో వుండేవి.                            గ్రామానికి సంబంధించి ఏ విషయమైనా ఇప్పటికీ హనుమాన్ మందిరం వద్దనే జరుగుతుంటాయి . ముఖ్యంగా పెద్దమనుషుల , పెండర్రాస్ మొదలగు సమావేశాలు ఇక్కడే జరిగేవి ,జరుగుతున్నాయి కూడా !                           గుడి పంతులుగా చాలా కాలం చెరుకు హన్మాండ్లు గారు వుండేవారు .ప్రస్తుతం వారికి ఆరోగ్యం బాగా లేక కొడిమ్యాల లో కూతురి వద్ద వుంటున్నారు.చాలా ఏళ్లు వారు కూల్చి వేయబడిన దొరవారి గడి లోనే అమ్మ తను వుండేవారు.                         ప్రస్తుతానికి మనకు

మా ఇంట్లో జామ బత్తాయి చెట్ల జోడి పైన పిట్టలే ..పిట్టలు ...గూళ్ళే గూళ్ళు ...అల్లరే అల్లరి. చూడండి.

Image
                         ఏమండీ మా ఇంట్లో ఒకే చెట్టు కు పిట్టలు  మూడు గూళ్ళు అల్లుకున్నాయి. ఇక వాటి అల్లరి మా ఇంట్లో కొత్త సందడి ని తీసుకొచ్చంది. మా పిల్లలు మేము వాటిని చూసి వాటి అల్లరిని పంచుకుని గడిపేశాం . సెల్ సిగ్నల్ వల్ల కానరాకుండా పోతున్న పక్షులు ఇలా మా ఇంట్లో ప్రత్యక్షమవడం ఎంతో ఆనందాన్ని నింపింది. ఇది మా ఇంట్లో జామ బత్తాయి కలగలసి పెరిగిన చెట్లు. ముచ్చట గా మూడు గూళ్ళు ...! చెట్టు నిండా గూళ్ళే ...! చెట్టు నిండా పిట్టలే.....!