హనుమాన్ మందిరము - మన ఊర్లో మొదటి గుడి.

                             మన గ్రామం లో హనుమాన్ మందిరం 1970 కి ముందే దొరల కాలం లో నిర్మాణం చేయబడింది. అపుడు ఈ ప్రహారీ ఏమీ లేదు . కేవలం గుడి చుట్టూ ఏమీ రక్షణ లేక చెత్త చెదారం తో వుండేది.దాని చుట్టూ గోడ నిర్మించాలనే ఆలోచన తో ఆనాటి శాస్త్రి యువజన సంఘం అందులో శ్రీ గోల్కొండ సీతారాం గారి ప్రత్యేక చొరవ తో నిర్మాణం పూర్తీ అయ్యింది. అనంతరం ప్రతి శనివారం భజన తప్పక ఉండేది . గంగుల రాజగంగారాం , తులసీ దాస్ లాంటి వాళ్ళు చక్కటి భజనలు చెప్పేవారు. విశేషం ఏమంటే భజనలన్ని కూడా మన ప్రాంతం లోని కోరుట్ల , మెట్పల్లి వాస్తవ్యులు రాసినవి మన యాస లో వుండేవి.
                           గ్రామానికి సంబంధించి ఏ విషయమైనా ఇప్పటికీ హనుమాన్ మందిరం వద్దనే జరుగుతుంటాయి . ముఖ్యంగా పెద్దమనుషుల , పెండర్రాస్ మొదలగు సమావేశాలు ఇక్కడే జరిగేవి ,జరుగుతున్నాయి కూడా !
                          గుడి పంతులుగా చాలా కాలం చెరుకు హన్మాండ్లు గారు వుండేవారు .ప్రస్తుతం వారికి ఆరోగ్యం బాగా లేక కొడిమ్యాల లో కూతురి వద్ద వుంటున్నారు.చాలా ఏళ్లు వారు కూల్చి వేయబడిన దొరవారి గడి లోనే అమ్మ తను వుండేవారు.
                        ప్రస్తుతానికి మనకు అంటే మన గ్రామానికి పంతులు లేరు.




కొలువై ఉన్న శ్రీ రామబంటు హనుమ !




వరుసగా నాగేంద్రుడు, వినాయకుడు, భక్తాంజనేయ, అమ్మవారు .




నవగ్రహ మందిరం .


భక్తుల వసతి కోసం షెడ్డు .


Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట