Posts

Showing posts from September, 2011

మొగిలిపేట గోదావరి లో చిక్కిన జాలరుల సంఘటన న్యూస్ క్లిప్పింగులు

Image
   

మొగిలిపేట గోదావరి లో చిక్కుకున్న జాలరుల ను హెలీకాప్టర్ల సహాయం తో రక్షించిన లైవ్ వీడియో

Image
                   గత శనివారం తేదీ 3.9.2011 రోజున  చేపల వేట కోసం మరియు పశువులను మేపడానికి తొమ్మిది  మంది  ఎప్పటి లాగానే గోదావరి  కుర్రు ( కుర్రు అంటే మా గ్రామం వద్ద గోదావరి L turn తీసుకుని ఎడమకు మరలి రెండు పాయలుగా చీలి ప్రయాణిస్తుంది ఈ క్రమంలో ఏర్పడిన మధ్య భూ భాగాన్నే కుర్రు అంటాం ) వెళ్లారు .ఇలా  జాలరులు , పశువుల కాపరులు రోజూ  వెళ్లడం మామూలే కాని ....                  శనివారం రోజున ఎగువన  గల శ్రీరాంసాగర్  ప్రాజెక్ట్  రిజర్వాయర్ అధికంగా నిండిన కారణంగా 19 గేట్ లను ఒకేసారి  ఎత్తివేయడం మూలాన  వరద ఉధృతి వేగంయ్యింది . ఉదయం వీరు వేటకు వెళ్లారు సాయంత్రాని కల్లా వరద వేగంగా  పెరుగుతూ నీటి  మట్టం  పెరగడం ప్రారంభమయ్యింది .ఇది గమనించిన ఆ తొమ్మిది మంది లో ఆరుగురు ఈదుతూ క్షేమంగా ఒడ్డు కు  చేరారు . ఐతే అగ్గ శేకర్ , ముక్కెర రాజశేకర్ కుర్రు లో చిక్కి పోగా తోకల గణేష్ మాత్రం గోదావరి నది మధ్యన గల చిన్న భూభాగం లో చిక్కుక్కున్నాడు . ఈ లోగా పోలీసులకు అధికారులకు సమాచారం అందించడం తో RDO హన్మంత్ రావ్ గారి ఆధ్వర్యం లో  గోదావరి ఒడ్డున  సహాయక రక్షిత చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడే ఫ్లడ్ లైట్లు జెనరేట