Posts

Showing posts with the label వీడియోలు

మొగిలిపేట గోదావరి లో చిక్కుకున్న జాలరుల ను హెలీకాప్టర్ల సహాయం తో రక్షించిన లైవ్ వీడియో

Image
                   గత శనివారం తేదీ 3.9.2011 రోజున  చేపల వేట కోసం మరియు పశువులను మేపడానికి తొమ్మిది  మంది  ఎప్పటి లాగానే గోదావరి  కుర్రు ( కుర్రు అంటే మా గ్రామం వద్ద గోదావరి L turn తీసుకుని ఎడమకు మరలి రెండు పాయలుగా చీలి ప్రయాణిస్తుంది ఈ క్రమంలో ఏర్పడిన మధ్య భూ భాగాన్నే కుర్రు అంటాం ) వెళ్లారు .ఇలా  జాలరులు , పశువుల కాపరులు రోజూ  వెళ్లడం మామూలే కాని ....                  శనివారం రోజున ఎగువన  గల శ్రీరాంసాగర్  ప్రాజెక్ట్  రిజర్వాయర్ అధికంగా నిండిన కారణంగా 19 గేట్ లను ఒకేసారి  ఎత్తివేయడం మూలాన  వరద ఉధృతి వేగంయ్యింది . ఉదయం వీరు వేటకు వెళ్లారు సాయంత్రాని కల్లా వరద వేగంగా  పెరుగుతూ నీటి  మట్టం  పెరగడం ప్రారంభమయ్యింది .ఇది గమనించిన ఆ తొమ్మిది మంది లో ఆరుగురు ఈదుతూ క్షేమంగా ఒడ్డు కు  చేరారు . ఐతే అగ్గ శేకర్ , ముక్కెర రాజశేకర్ కుర్రు లో చిక్...

కోలాటం - మొగిలిపేట లో భక్తి ప్రపత్తులతో నిమజ్జనం - వీడియో.

                                   మొగిలిపేట వినాయక నిమజ్జన ఉత్సవాలు మన గ్రామం లో ఉత్సాహంగా జరిగాయి . ఆది , సోమవారాల్లో నిర్వహించారు . కోలాటం , భజన గీతాలు , యువకుల నృత్యాలతో శోభాయాత్ర సాగింది .                         గణనాథా ఇక సెలవు ... మా గ్రామాన్ని చల్లగా చూడు తండ్రి .                  కోలాటం గ్రామ పెద్దమనిషి శ్రీ. మాసుల రాజగంగారాం గారి ఆధ్వర్యం లో జరిగింది . ఇందులో శ్రీయుతులు బంటు హన్మాండ్లు ,మాసుల పెద్దిరెడ్డి, ఏసురత్నం , మసుల వినోద్ , గాజుల పెద్ద గంగారెడ్డి , గాజుల చిన్నారెడ్డి , ఎనడ్ల రాములు , రెబ్బస్ కొమురయ్య , మాసుల  చిన్నయ్య , వరద ఆశన్న , గోల్కొండ లింగారెడ్డి, మామిడి తుక్కన్న , మామిడి సత్తయ్య ,  మొదలగు వారు పాల్గొన్నారు.

మొగిలిపేట్ వద్ద మలుపు తిరుగుతూ తన పరవళ్ల తో మైమరిపిస్తున్న గోదారి - పాలరేవు.

                                                గోదారమ్మ సరిగ్గా మొగిలిపేట్ వద్దనే మలుపు తిరిగి వెళుతుంది. వెళుతూ వెళుతూ రెండు గా చీలుతుంది. ఈ చీలికలు మరో పది కిలోమీటర్లు ప్రయాణించి దామ్రాజ్ పల్లి వద్ద కలుసుకొని వాల్గొండ శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద విశాలంగా అగుపిస్తుంది. అలా మా గ్రామం వద్ద మలుపులో తన పరవళ్ల తో ఆకట్టుకొంటున్న గోదారి హోరు ను వింటూ చూడండి.

పోచంపాడ్ ప్రాజెక్ట్ నీరు వదిలారు .. సందర్శకుల తాకిడి పెరిగింది ... నీటి హోరు చూడండి.

                 పోచంపాడ్  ప్రాజెక్ట్  మాకు నీరు అందించే జలాశయం. ప్రస్తుతం దీనిలోకి  విపరీతమైన వరదనీరుచేరడం తో  నీటి నిలువ గరిష్ట స్థాయిని దాటింది . 34 గేట్లను ఎత్తారు .పరవళ్ళు త్రోక్కుతున్న నీటి హొయలు చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు .

బాదనకుర్తి బ్రిడ్జ్ వద్ద వరద గోదారి పరవళ్ళు .....!

                                           ఇటీవలే ప్రారంభమైన బాదనకుర్తి వంతెన వద్ద గోదారి పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తోంది. మా మొగిలిపేట గ్రామానికి ఇది మూడు కిలోమీటర్ల దూరం లో వుంటుంది. వచ్చి పోయేవారిని అమితంగా ఆకర్షిస్తోంది.

"అప్లాని గుర్రాలు" .. ఈ సీజన్ లో అలా ఒకదాని పై ఒకటి గుంపుగా కదలడం విచిత్రమే !

ఇవండి అప్లాని గుర్రాలంటే .. అలా ఎంత దూరమైనా వాటి ప్రయాణం ఉమ్మడిగానే ...!

మొగిలిపేట చెరువు కట్ట తెగిన వీడియోలు - 1

కట్ట తెగిన మంగలి గండి వద్ద వెళ్లి పోతున్న నీరు ......!

మొగిలిపేట దాటి మల్లెంపంపు వద్ద వరదకు కొట్టుకుపోతున్న రోడ్డు వీడియో

మొగిలిపేట దొంగల మోరి వద్ద పచ్చదనం తో నిండిన చిట్టడవి - టేకు వనం ( వీడియో )

                                   మన గ్రామం నుండి కొండాపురం పోయే తోవల గల దొంగల మోరి ణి ఆనుకుని వున్న చిట్టడవి లో పచ్చదనం పరుచుకుంటోంది. టేకు వనం చిగురేయడం వల్ల కొత్త అందాల తో అడవి ఆకర్షిస్తోంది.

ఎడ్లు నెమరు వేస్తున్నాయి...మనమూ వేద్దాం రండి...! వీడియో

            ఎడ్లు, బర్లు నెమరు వేస్తుంటాయి. అలాగ.... వాటిని చూస్తూ కూర్చుంటే ఎంత బాగనిపిస్తుందో..!  అవి వాటి ఆహారాన్ని నేమరువేస్తాయి .....మనం అప్పుడప్పుడు మన జీవితాన్ని నెమరు వేద్దాం రండి  !

గిజిగాడి అల్లిక లో ...ఎంత ఇంజనీరింగో ... అల్లుతున్నాడు పదండి...చూద్దాం ...!

Image
గిజిగాడి పై మనసుపడి  గుఱ్ఱం జాషువా గారు అల్లిన వాక్యాలు ........... తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! పచ్చపిట్టె  గూడు ఎంత సుందరమో ....! మా ఇంటి వెనకాల ఇలా తన పనిలో బిజీ గా దర్శనమిచ్చాడు మన గిజిగాడు ....!

కడుపు నిండా నీటి తో మన చెరువు

కత్తెర దారు పట్టిచ్చే సామాన్య యంత్రం