Posts

Showing posts from January, 2012

రైతులకు అందుబాటులో గత 35 ఏళ్లు గా మొగిలిపేట లో సేవలు అందిస్తున్న పశువుల దవాఖాన

Image
గతం లో మంద రాజన్న ఇంటి వద్ద పశువుల దవాఖాన ఉండేది . ప్రస్తుతం స్వంత భవనం సమకూరాక కొత్త బస్టాండ్ సమీపం లో ఉంది . గోదావరి కి వెళ్ళే మార్గం లో పశువుల ఆసుపత్రి .

ప్రతీ చలి కాలం సీజన్ లో కనిపించే మావి , చిక్కుడు , ఉసిరి మొదలగు పూతలు మా పెరట్లో కనిపించిన పూతలు .

Image
 చిక్కుడు  పూత  ఉసిరి పూత   మామిడి పూత గ్రామాల్లో మామూలుగా ఈ సంక్రాంతి చలి కాలం లో మామిడి , ఇప్ప పూత వేయడాన్ని మామిండ్లు - ఇప్పలు పలుగు తాయి అంటారు . అంటే పూత విరగ బూస్తుంది అని అర్థం . మా గ్రామం  లోని మా కోటకాల్వ వద్ద గల మామిడి బాగు లోనివి ఈ ఫోటోలు .

మొగిలిపేట లో గత కొన్నేళ్లుగా అనేక రూపాల్లో ఉపయోగపడుతున్న పాత తరం భవంతి

Image
                మా ఎరుక నుండి మొదలు ఈ భవంతి ముందుగా గ్రామ తపాల కార్యాలయం గా ఉండేది . అది బహూశా 1980  ప్రాంతం లో , అనంతరం పాతశాలకు తగిన వసతి లేని కారణంగా ప్రాథమిక పాటశాలను ఇందులోకి మార్చారు . ఆ తరువాత పాటశాలకు ఇప్పుడున్న శాశ్వత భవనం చేకూరడం తో ఈ భవనం ఖాళీ అయ్యింది .       ప్రస్తుతం వయోజన నిరంతర విద్యా కేంద్రం గా ఉపయోగ పడుతోంది . పాత తరం భవనాల్లో మిగిలిఉన్న ఏకైక భవనం ఇదొక్కటే కావడం విశేషం .  

మొగిలిపేట ఉన్నత పాటశాల లో ఘనంగా స్వయంపరిపాలనా దినోత్సవం

Image
మొగిలిపేట ఉన్నత పాటశాలలో విద్యార్థులు నవంబర్ 14 న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని "స్వయంపరిపాలనా " దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు .

గ్రామాల్లో కి కూడా చేరుకున్న మనీ బదిలీ సంస్థలు - మొగిలిపేట లో ఉస్కెల చిన్నయ్య నడుపుతున్న western union.

Image
               సమకాలీన ప్రపంచం లో విశ్వమంతా ఒకే గ్రామం గా మారినట్టు తోస్తున్నది . సమాచార విప్లవం అనేక రూపాల్లో వివిధ సౌకర్యాలను సమకూర్చుతోంది . అలా గ్రామాల్లో ఇంటర్నెట్ అనేది వారికి చాలా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది . అలా మొగిలిపేట లో చిన్నయ్య అనే యువకుడు western union లాంటి మనీ ట్రాన్స్ ఫర్ సంస్థను నడుపుతున్నాడు . western union in Mogilipet                                                              చిన్నయ్య , నాగరాజు , గంగాధర్