Posts

Showing posts with the label పాడి పంట

పసుపు రైతులు పసుపును ఉడకబెట్టే పనిలో ఉన్నారు ... కాని పసుపు మద్దతు ధరలు పాతాళం లో ఉన్నాయి . ఘోరం .

Image
గత సంవత్సరం తో పోల్చినపుడు పసుపు రైతు తీవ్రమైన దిగాలు తో ఉన్నాడు . ఎందుకంటే గతం లో క్వింటాలు  రూ .15000 వరకు పలికిన మద్దతు ధర నేడు రూ. 5000 లకు పడిపోయింది. అతని శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు . ప్రభుత్వం దీని విషయం ఆలోచించాలి .   పసుపు  ఉడకబెట్టే యంత్రం  పసుపు రైతులు

బాలమ్మ బండల వద్ద బర్ల మంద

Image
గ్రామం లోని గాంధీ నగర్ అంటే ఎర్రగడ్డ పశువులు ముఖ్యంగా బర్ల మంద బాలమ్మ బండల వద్ద సేదదీరుతాయి . అక్కడే పశువుల దాహం తీరడానికి నీటి తొట్టి ఒకటి నిర్మించి ఉంది . చెరువు తీరం లో ఈ ప్రదేశం ఉంది.  పశువులకోసం నీటి తొట్టి  సేదదీరడానికి చింత చెట్లు మర్రి ఉన్నాయి . మర్రి కింద విశ్రాంతి లో బర్లు.

మామిడి పూత ల కాలం వచ్చింది ... మామిళ్ళు నిండుగా పగులుతున్నాయి .... సంతోషం.

Image
ఈ సారి మామిళ్ళు నిదు పూత తో పగులుతున్నాయి . మామిడి రైతులకు సంతోషకరమైన విషయం . అలా నేను చూసిన ఒక మామిడి నిండు దనాన్ని ఇక్కడ చూడవచ్చు .

ప్రతీ చలి కాలం సీజన్ లో కనిపించే మావి , చిక్కుడు , ఉసిరి మొదలగు పూతలు మా పెరట్లో కనిపించిన పూతలు .

Image
 చిక్కుడు  పూత  ఉసిరి పూత   మామిడి పూత గ్రామాల్లో మామూలుగా ఈ సంక్రాంతి చలి కాలం లో మామిడి , ఇప్ప పూత వేయడాన్ని మామిండ్లు - ఇప్పలు పలుగు తాయి అంటారు . అంటే పూత విరగ బూస్తుంది అని అర్థం . మా గ్రామం  లోని మా కోటకాల్వ వద్ద గల మామిడి బాగు లోనివి ఈ ఫోటోలు .

తోటల్లో బుర్కబెడ్డల సందడి షురూ ...!

Image
ఉదయం అలా తోట్లో  కి వెళ్ళగానే ముద్దు గా రైతును పలకరించే తడి మట్టి బెడ్డల్నేబుర్క బెడ్డలు అంటారు . ఇవి వాన పాముల వల్ల తయారవుతాయి. చేనుకు బలంగా సారవంతం చేస్తాయి కూడా . పిల్లలకు వీటి తో ఆడుకోవడం మహా సరదా . ఈ మధ్య నేను ఓ తోటలోనికి వెళ్ళినపుడు ఇవి దర్శనమిచ్చాయి . మొక్కజొన్న దంట్ల నడుమ అందంగా మెరిసి పోతున్నాయి .   మెరిసిపోతున్న  బుర్కబెడ్డ ...!   ఇలా  తోట నిండా అవే ..! ఐతే నేటి ఎరువుల మూలాన చాలా చోట్ల వీటి దర్శనం కరువవుతోంది .  

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.

Image
పసుపు సాగు చేస్తున్న ప్రధాన ప్రాంతాల్లో కరీంనగర్ ,నిజామాబాద్ లు ముఖ్యమైనవి. సంప్రదాయ  పద్దతుల్లో పసుపును పెద్ద పెద్ద "కడాయిల్లో " పెద్ద గోతులు తవ్వి ఉడకబెడుతుంటారు. ఈ సీజన్ లో ఊరికి నాలుగు ఐదు చొప్పున పసుపు ఉడకబెట్టడానికి బాయిలర్లు వచ్చాయి. పూర్తిగా  ఆవిరి తో ఉడికే పద్దతి కావడం వల్ల తక్కువ  కట్టెల తోనే బోలెడు పసుపు ఉడుకుతోంది . రైతులు దాదాపు అందరూ ఈ యంత్ర్రాల ద్వారానే ఉడకేస్తున్నారు . తక్కువ పసుపు దిగుబడి వచ్చిన వాళ్ళు మాత్రం కడాయిల్లో ఉడకేస్తున్నారు . మొత్తానికి అవసరాలు , కాలం తో పాటు  మార్పు కళ్ళ  ముందే అగుపిస్తోంది....... క్రింద వీడియోలో ఉడకబెట్టే  యంత్రాన్ని చూడవచ్చు .  

దుడ్డె తినడానికి లేలేత ఎనాద్రి మొక్కను మేత గా వేస్తారు .. దాని లేత చివురుకు సుతి మెత్తని మేత .

Image
పసి పాప గా ఈ లోకం లోకి వచ్చిన బర్రె ( గేదె ) పిల్ల దుడ్డె  కోసం వేసే గడ్డి మొక్క పేరే ఎనాద్రి .

అనవసర వర్షాలతో నానిపోతున్న మక్క కంకి .... దిక్కు తోచని రైతు.

Image
                                   ఇటీవలి అల్పపీడన వర్షాల వల్ల తోట్లో, మైదానాల్లో ఆరబెట్టేందుకు ఉంచిన మక్క కంకి నాని పోయింది. వర్షాలు వచ్చాయి అనే ఆనందం లో బీడు భూముల్ని కూడా సాగు లోకి తెచ్చిన రైతులకు నిరాషే మిగిలింది. మార్కెట్ లో ఏమాత్రం ధర పలకని కంకి ని ఏంచేయాలో అర్ధం గాక రైతులు దిగాలు పడుతున్నారు. మంచి దిగుబడి వచ్చిందన్న ఆనందం లేకుండా పోయింది...! ఆరుబైట కంకి కుప్పలు పోసిన రైతులు .... వర్షాల తో తడిసాయి.