పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.
పసుపు సాగు చేస్తున్న ప్రధాన ప్రాంతాల్లో కరీంనగర్ ,నిజామాబాద్ లు ముఖ్యమైనవి.
సంప్రదాయ పద్దతుల్లో పసుపును పెద్ద పెద్ద "కడాయిల్లో " పెద్ద గోతులు తవ్వి ఉడకబెడుతుంటారు.
ఈ సీజన్ లో ఊరికి నాలుగు ఐదు చొప్పున పసుపు ఉడకబెట్టడానికి బాయిలర్లు వచ్చాయి.
పూర్తిగా ఆవిరి తో ఉడికే పద్దతి కావడం వల్ల తక్కువ కట్టెల తోనే బోలెడు పసుపు ఉడుకుతోంది .
రైతులు దాదాపు అందరూ ఈ యంత్ర్రాల ద్వారానే ఉడకేస్తున్నారు .
తక్కువ పసుపు దిగుబడి వచ్చిన వాళ్ళు మాత్రం కడాయిల్లో ఉడకేస్తున్నారు .
మొత్తానికి అవసరాలు , కాలం తో పాటు మార్పు కళ్ళ ముందే అగుపిస్తోంది.......
క్రింద వీడియోలో ఉడకబెట్టే యంత్రాన్ని చూడవచ్చు .
Excellent post. Could you add more info?
ReplyDelete1. how much it costs?
2. who is buying? Is it also like Tractors - rent based.
3. What all companies are selling it?
4. Where are they available, like in Hyderabad? or somewhere else?
5.Where are they manufactured?
హ్మ్ ! ఐతే పసుపు ని కొమ్ములు ఉడికించి తీస్తారా , నేను ఎండపెట్టి తీస్తారు అనుకుంటున్నా ఇన్ని రోజులు !
ReplyDeleteశ్రావ్య గారు ...నమస్కారం.
ReplyDeleteనిజంగా మీకు తెలియదా !
ఉడకబెట్టి తెస్తారు ... దాన్ని మిల్లింగ్ చేస్తే పసుపు పొడి వస్తుంది.
ఒరెమునా గారికి నమస్కారం.
ReplyDeleteత్వరలోనే
మీ ప్రశ్న లకు కావలసిన వివరాలను ఉంచుతాను.
మీ ఆసక్తి కి ప్రత్యేక దన్యవాదములు.
నాగరాజు గోల్కొండ - మొగిలిపేట్
అవునండి నిజం గానే , నాకు ఇప్పటికి ఎండపెట్టి తీసే పద్దతి కూడా ఉంది అనుకుంటా నేను చిన్నపుడు చూసిన గుర్తు ఆ దున్నిన తరవాత ఆ ఏరిన పసుపు కొమ్ములని ఎందపెట్టం , మరి అది ఐనా దేనికన్ననేమో .
ReplyDeleteఈ భాఇలరు కుకటపల్లి లో(హైథారాబాద్) తయరుచెస్తారు,
ReplyDeleteదీని రేటు సుమారుగా 4 లక్షలు.
శ్రీను గారు అవును ...
ReplyDeleteదీని ధర నాలుగు లక్షల వరకు ఉంటుంది.
మా ఊర్లో ఈ సంవత్సరమే తొలిసారి నాలుగు బాయిలర్లు తెచ్చారు.
దన్యవాదములు.
మా పెరటి LO 2yr bak oka pasupu kommu vesanu ipudu 5kg pasupukommlu vachai dani ela vadukovalo chbutara plz? enduku udaka petali
ReplyDelete