బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

               అడవి ఒకో ఋతువులో ఒకో అందాన్ని అలంకరించుకుంటుంది. ఈ శిశిరం లో మోదుగు పూల తో మొదలై బూరుగు చెట్టు  ఒంటి నిండా బూరుగు పూలతో ఎర్రని రంగు లో అడవి సిగ లో అందమైన పువ్వు లా ఉంటుంది. బూరుగు పువ్వు ను  క్రింద చూడండి .
             సరదా విషయం ఏమంటే .... గ్రామాల్లో పిల్లలు చెరువు కు స్నానానికి వెళితే ...అక్కడి బూరుగు చెట్టు యొక్క ఖాండం పై గల ముళ్ళను తీసుకుని వాటిని టేకు చెట్టు నారలో చుట్టుకుని తాంబూలం లాగా నోట్లో వేసుకుని నములుతారు . కాసేపటికి నోరంతా ఎర్రగా మారుతుంది. భలే హాయిగా ఆడుకుంటూ ఉంటారు. మీరు కూడా వేసుకోండి మరి ......


బూరుగు  పువ్వు

బూరుగు  చెట్టు 

ఎర్రని  బూరుగు పువ్వు అందం.










Comments

  1. beautiful!
    boorugu puvvu ni modatisaari choostunnaa,thanks for sharing :)

    ReplyDelete
  2. బావున్నాయ్ పువ్వు , చెట్టు కూడా నేను ఇదే మొదటిసారి చూడటం !

    ReplyDelete
  3. శ్రావ్య గారు నమస్కారం ..బాగున్నారండి.
    ఈ పువ్వు కూడా మోదుగు లాగే బాగా ఆకర్షిస్తుంది.
    ఉదయం వెళ్లి చూస్తే ఎన్నో పూలు చెట్టు కింద రాలి ... ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ధన్యవాదములతో ...నాగరాజు గోల్కొండ.

    ReplyDelete
  4. నమస్కారమండి ! బావున్నాను , మీరెలా ఉన్నారు . మీ బ్లాగ్లో ఈ ఫోటోలు , వాటి గురించి చూసినప్పుడల్లా నాకు ప్రకృతి కి దగ్గర గా పెరిగిన నా చిన్నప్పటి రోజులు గుర్తు కొస్తాయి .

    ReplyDelete
  5. శ్రావ్య గారు ... మోదుగు పూల గురించి మరో posting ఇచ్చాను చూడగలరు ... ఉంటానండి .

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.