తోటల్లో బుర్కబెడ్డల సందడి షురూ ...!
ఉదయం అలా తోట్లో కి వెళ్ళగానే ముద్దు గా రైతును పలకరించే తడి మట్టి బెడ్డల్నేబుర్క బెడ్డలు అంటారు .
ఇవి వాన పాముల వల్ల తయారవుతాయి.
చేనుకు బలంగా సారవంతం చేస్తాయి కూడా .
పిల్లలకు వీటి తో ఆడుకోవడం మహా సరదా .
ఈ మధ్య నేను ఓ తోటలోనికి వెళ్ళినపుడు ఇవి దర్శనమిచ్చాయి .
మొక్కజొన్న దంట్ల నడుమ అందంగా మెరిసి పోతున్నాయి .
మెరిసిపోతున్న బుర్కబెడ్డ ...!
ఇలా తోట నిండా అవే ..!
ఐతే నేటి ఎరువుల మూలాన చాలా చోట్ల వీటి దర్శనం కరువవుతోంది .
Ye Kya Hai ?
ReplyDelete