మొగిలిపేట గోదావరి లో చిక్కుకున్న జాలరుల ను హెలీకాప్టర్ల సహాయం తో రక్షించిన లైవ్ వీడియో


                   గత శనివారం తేదీ 3.9.2011 రోజున  చేపల వేట కోసం మరియు పశువులను మేపడానికి తొమ్మిది  మంది  ఎప్పటి లాగానే గోదావరి  కుర్రు ( కుర్రు అంటే మా గ్రామం వద్ద గోదావరి L turn తీసుకుని ఎడమకు మరలి రెండు పాయలుగా చీలి ప్రయాణిస్తుంది ఈ క్రమంలో ఏర్పడిన మధ్య భూ భాగాన్నే కుర్రు అంటాం ) వెళ్లారు .ఇలా  జాలరులు , పశువుల కాపరులు రోజూ  వెళ్లడం మామూలే కాని ....
                 శనివారం రోజున ఎగువన  గల శ్రీరాంసాగర్  ప్రాజెక్ట్  రిజర్వాయర్ అధికంగా నిండిన కారణంగా 19 గేట్ లను ఒకేసారి  ఎత్తివేయడం మూలాన  వరద ఉధృతి వేగంయ్యింది . ఉదయం వీరు వేటకు వెళ్లారు సాయంత్రాని కల్లా వరద వేగంగా  పెరుగుతూ నీటి  మట్టం  పెరగడం ప్రారంభమయ్యింది .ఇది గమనించిన ఆ తొమ్మిది మంది లో ఆరుగురు ఈదుతూ క్షేమంగా ఒడ్డు కు  చేరారు . ఐతే అగ్గ శేకర్ , ముక్కెర రాజశేకర్ కుర్రు లో చిక్కి పోగా తోకల గణేష్ మాత్రం గోదావరి నది మధ్యన గల చిన్న భూభాగం లో చిక్కుక్కున్నాడు . ఈ లోగా పోలీసులకు అధికారులకు సమాచారం అందించడం తో RDO హన్మంత్ రావ్ గారి ఆధ్వర్యం లో  గోదావరి ఒడ్డున  సహాయక రక్షిత చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడే ఫ్లడ్ లైట్లు జెనరేటర్ సహాయం తో ఒక లౌడ్ స్పీకర్ బిగించి అక్కడి ఒడ్డున గల బాదితులకు రాత్రంతా  సూచనలు సలహాలు ధైర్యం చెప్పడం జరిగింది . గ్రామస్థులు అంతా అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు .
                 ప్రభుత్వాన్ని కలెక్టర్ మరియు RDO గారు అర్థించడం తో రెండు సైనిక హెలీకాప్టర్ లు ఆదివారం ఉదయం 9 గంటల సమయం లో  సంఘటనా స్థలానికి చేరుకొని గోదావరి మధ్యలో గల తోకలి గణేష్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి . అలాగే కుర్రు కు చిక్కుకున్న ఇద్దరిని బోటు సహాయం తో ఒడ్డు  కు చేర్చారు . కథ సుఖాంతం అయ్యింది . వారి వారి కుటుంబ సభ్యులు గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు . గౌరవ శాసన సభ్యులు శ్రీ కలవకుంట్ల విద్యాసాగర్ రావు గారు మొదటి నుంచి చివరి వరకు పర్యవేక్షించారు .
             గ్రామస్థులు అందరికి ఈ సంఘటన ఒక మరిచిపోలేని సాహస ఘట్టం గా  గుర్తుండిపోగలదు .

Comments

  1. పర్‌ఫెక్ట్ న్యూస్‌ కవరేజీలా అందించారు. మీ సమాచారం బాగుంది. అలాగే.. గోదావరిలో చిక్కుకున్న జాలరుల న్యూస్‌ ఆ రోజు ఎప్పటికప్పుడు ABN ఆంధ్రజ్యోతి అందించింది.
    -mn swamy goud

    ReplyDelete
  2. పర్‌ఫెక్ట్ న్యూస్‌ కవరేజీలా అందించారు. మీ సమాచారం బాగుంది. అలాగే.. గోదావరిలో చిక్కుకున్న జాలరుల న్యూస్‌ ఆ రోజు ఎప్పటికప్పుడు ABN ఆంధ్రజ్యోతి అందించింది.
    -mn swamy goud

    ReplyDelete
  3. స్వామి గారు నమస్కారం బాగున్నారా ...!
    ముందుగా ఆంధ్రజ్యోతి కి దన్యవాదములు . గ్రామం మొత్తం చాలా thrill గా అనుభూతి పొందినది .ఉంటాను.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట