మా ఊరి మసీదు మరియు చిన్న దర్గా .

                                              గ్రామం లో ఒకప్పుడు పాత మసీద్ ఇదే స్థానం లో వుందేడిది. అది శిథిలావస్థకు రావడం తో కొత్తగా దీనిని నిర్మించారు . అలాగే 30 ఏళ్ల క్రితం  ఒక చౌకిదార్ మా గ్రామం లో పని చేస్తున్న కాలం లో ఒక చిన్న దర్గాను నిర్మించాడు .


ఈ మసీదు ఆధారంగా గ్రామం లో పీరీల పండుగ జరుపుతారు . గ్రామస్తులంతా మత కుల భేదం లేకుండా పాల్గొని మొక్కులు చెల్లించు కుంటారు . సంబంధిత భక్తులకు పూనకం వస్తుంది . వారితో భక్తులు భూత భవిష్యత్తు వారి వారి సంశయాల గురించి మాట్లాడతారు. మంత్ర తంత్రాల తో బాధ పడే భక్తులు ఆ రోజు పూనకం వచ్చిన దేవునితో అగ్ని గుండం లో నుంచి నడుస్తారు . అలా చేయడం రోగం పోతుందని విశ్వసిస్తారు. నెమలి కట్ట తో వీపు ల మీద బాదడం పూనకం వచ్చిన వ్యక్తి చేసే సాధారణ క్రియ.
ఇలా పండగ లో అందరూ పాల్గొని విజయవంతం చేసి ఉరేగింపుగా వెళ్లి పీరీలను నిమజ్జనం చేస్తారు. పిల్లా పాపలతో కలిసి ఈ పండగలో అందరూ పాల్గొంటారు. చాలా మంది వారి వారి మొక్కుల కు అనుగుణంగా పులివేషాలు , సాయబుల వేషాలు, బాలింత, లాంటి వింత వింత వేషాలు వేసి అలరిస్తారు. చిన్న పిల్లలకు ఎంతో ఆనంద అందించేపండగ ఇది.పండగకు పది రోజుల ముందు నుండే రాత్రి గ్రామ యువకులంతా మసీదు వద్ద కు చేరి అగ్ని గుండం చుట్టూ తిరుగుతూ చక్కటి తెలంగాణ మాండలిక జానపదాలు పాడతారు . ఆ పాటలు వినడానికి ఊరు ఊరంతా వస్తారు. అనంతరం అగ్నిగుండం లో నుండి నడవడం తో ముగుస్తుంది. ఇది ప్రతీ రోజు జరుగుతుంది. ఇలా పాటలు పాడడం లో మా గ్రామం లో " పూతల గంగన్న" ది పెట్టింది పేరు. ఇదీ మసీదు కార్యక్రమం.

ఇది గ్రామ లోని దర్గా ముస్లిం సోదరులుమొక్కు తీర్చుకునే స్థలం.

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట