ఘనంగా జరిగిన పెద్దమ్మ తల్లి జాతర - మళ్లీ ఐదేళ్లకు పునర్దర్శనం

మా గ్రామం లో  ప్రతీ ఐదేళ్లకు ఒక సారి పెద్దమ్మ తల్లి జాతర జరుగుతుంది .
సుమారుగా  తెలంగాణా గ్రామా లన్నింటిలో ఇలాగే ఆనవాయితీ ఉంది .
గ్రామ కుల సంఘాల సమితి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
తేదీ  8.5.2011 ఆదివారం రోజున జాతర జరిగింది .

అమ్మ  వారిని రంగులతో అద్దడానికి గ్రామ శివారుల్లో ఒక పందిరి వేసి అక్కడికి తీసుకెళతారు. ఈ సారి కోటకాల్వ మామిండ్ల లో అద్దకం కార్యక్రమం ఏర్పాటు చేశారు . అద్దకాని కి వారసత్వంగా పని చేసే నకాయిషీ లు రంగులు అద్దుతారు .
అద్దకం పూర్తీ అయ్యాక గ్రామస్తులంతా వెళ్లి అమ్మవారిని ఘనంగా దేవాలయానికి ఎదుర్కొంటారు .
ఇట్టి కార్యక్రమం లో " ద్యావతి " వాండ్ల విన్యాసాలు గ్రామస్తులను బాగా ఆకర్షిస్తాయి . కాని ఈ సారి అంత చెప్పుకోదగ్గ విన్యాసాలు ఏమి ప్రదర్శించ లేకపోయారు . ఎదుర్కోలు సమయం లో కోళ్ళ మేడలు విరిచి పాడేయడం, కోడి గ్రుడ్లను తింపి విసరడం ...వల్ల అమ్మ వారి కోపం చల్లారుతుందని విశ్వసిస్తారు. మహిళలు దారి పొడుగునా మంగళ హారతులతో స్వాగతం చెపుతూ కొబ్బరికాయలు కొడతారు . ఈ విధంగా అమ్మవారి ఉరేగింపు సాగుతుంది. 

అమ్మ వారి పండుగ చేయడం వల్ల గ్రామం ఎలాంటి రోగాలు లేకుండా సుఖంగా ఉంటుందని, కీడు జరగదని  విశ్వసిస్తారు .  

ఇది  అమ్మవారి ఆలయం .


అమ్మ  వారి ఊరేగింపు .

ఊరేగింపు లో ముందు నడుస్తున్న "ద్యావతులు"  - వారు ధరించిన తాడును "శర్నకోల" లు అంటారు .
గొడుగు లాగ అగుపడుతున్న దానిని "గొళ్ళెం" అంటారు .దానిని అమ్మవారి ఛత్రం గా భావిస్తారు . ఇట్టి గోళ్ళాన్ని "గంగపుత్రులు" ప్రత్యేకంగా తయారు చేయడం ఆనవాయితీ ... దాదాపు అన్ని జాతరలకు ఈ పని వారి ద్వారానే జరుగుతుంది. అలాగే అద్దకం పూర్తయిన అమ్మవారి విగ్రహాన్ని గ్రామం లోని "ముదిరాజ్ " లు మోయడం ఆనవాయితీ . అలాగే ఇట్టి కార్యక్రమం కు సంధించిన పూజాది వ్యవహారాలలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటారు . ఈ విధంగా ఏదోరకంగా అన్ని కులాల యోగాదానం ఉంటుంది . ఇది గ్రామం లో సమైఖ్య భావనకు దారి తీస్తున్దనేది పెద్దల ఆలోచన .

ఊరేగింపు  అనంతరం ఆలయం ముందు అమ్మవారికి పూజలు బోనం సమర్పణ జరుగుతుంది .

దురాచారాలు :
  • ఇప్పటికీ జంతు బలి తో అమ్మవారిని సంతృప్తి పరచాలనుకోవడం విడ్డూరం .
  • గావు  పట్టడం పేరు తో మేకపిల్ల గొంతును నోటి తో కొరికి చంపడం జుగుప్స కలిగిస్తుంది 
ఇలా కొన్ని దురాచారాలు తప్ప మిగతా అంతా చాలా బాగా జరగడం విశేషం . ఇట్టి కార్యక్రమం  పై ప్రజల నమ్మకం విశ్వాసం అమోఘం . 
అమ్మ వారికి వినమ్ర ప్రణామములు సమర్పించు కొంటూ  .....  నాగరాజు గోల్కొండ .







     




    Comments

    1. ఐదేళ్లకు ఒక సారి జరిగే మీ ఊకి పెద్దమ్మ తల్లి జాతర విశేషాలు బాగున్నాయి. ఈ కంఫ్యూటర్ యుగంలోనూ జంతువులను బలి చేయడం నిజంగా విడ్డూరమే. గావు పట్టే కార్యక్రమం ఈ కాలంలో కూడా కొనసాగించడం శోచనీయం.
      -ముద్దం స్వామిగౌడ్‌
      ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

      ReplyDelete
    2. స్వామీ గారు దన్యవాదములు ... మల్లాపూర్ లో కూడా అమ్మవారి జాతర జరుగుద్దనుకుంటాను .

      ReplyDelete

    Post a Comment

    Popular posts from this blog

    బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

    సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

    పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.