మన గ్రామం లో దేశ నాయకుల బొమ్మలు

                                        మన గ్రామం లో మహనీయుల విగ్రహాల ను నిలపడం 1977 లో ప్రారంభమయ్యింది . అప్పుడు పెద్దబాపు కే.వి రాజేశ్వర్ రావు , నడిబ్బాపు సుధాకర్ రావు , మరియు శాస్త్రి యువజన సంఘం సభ్యులు గోల్కొండ సీతారాం , విద్యాసాగర్ , అంకతి పెద్ద రాజన్న , మసుల పెద్ద రాజన్న మొదలగు వారు వాటిని చేయించి తెచ్చి ప్రధాన కూడళ్ళలో నిలబెట్టారు .



                                                  


                      ఇది గాంధీ బొమ్మ ఎర్రగడ్డ లేదా గాంధీ వాడ లో ఈ బొమ్మ వుంది.  దీన్ని నిలబెట్టిన తరువాత అప్పటి ఆ వాడ యువకులు గాంధీ బాల సంఘం పేరు తో ఒక యువజన సంఘాన్ని ప్రారంభించుకొన్నారు. ఇప్పటికి అది వుంది.


ఇది యుద్ద సేనాని నేతాజీ బొమ్మ . ఊర్లో చాలా మంది నిరక్ష్య రాస్యులు పలకరాక తెలవక గుఱ్ఱం బొమ్మ అనికూడా పిలుస్తారు. ఇది దుబాయ్ దాతల చేత నాటి సర్పంచ కీ.శే. శ్రీ చెట్లపెల్లి చిన్ననర్సాగౌడ్ మరియు గ్రామ ప్రజల విరాళాల ఆధారంగా నెలకొల్పారు. ఇది గ్రామ పంచాయతి వద్ద కూడలి లో నెలకొల్పారు.


ఈ బొమ్మను 1977 లో నెల కోల్పారు . ఇది కూడా శాస్త్రి యువజన సంఘ ఆధ్వర్యం లో తీసుకరావడం జరిగింది.




రాజ్యాంగ నిర్మాత డా. అంబేత్కర్ విగ్రహాన్ని గ్రామ అంబేద్కర్ యువజన సంఘ యువకులు బస్ స్టాండ్ వద్ద నిర్మించారు. ఇక్కడ వారి  ప్రతి వర్ధంతి , జయంతి జరుపుతారు.




ఇది అగ్గి పిడుగు అల్లూరి విగ్రహం దీనిని చైతన్య యువజన సంఘ యువకులు గ్రామ విరాళాల చేత నిలబెట్టారు. ఇది కూడా బస్ స్టాండ్ లోనే వుంటుంది.
ఇలా మొత్తం మన గ్రామం లో ఐదు బొమ్మలు వున్నాయి.
తరతరాలకు స్పూర్తిని అందిస్తూనే వున్నాయి.

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.