సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

                                        వర్షాలు ఆరంభం కాగానే శ్రావణం లో అలా పొదలపై వాలి కనిపిస్తుంటాయి ఈ కాకరకాయ తీగలు. చూడగానే ముద్దొచ్చే బోడ శరీరం తో ఆకర్షిస్తుంటాయి. సీజనల్ రుచి లో నంబర్ వన్ కాయ గాబట్టే దీనికి డిమాండు ధర అన్నీ ఎక్కువే ...! అడవికి వెళ్తే గాని దొరకదు ,...!
                                   ఇంత డిమాండ్ వుంది కదా మనమే ఓ పంటేసి పండిస్తే పోలా ...! అనుకుంటే కుదరదు ఎందుకంటే అన్నీ కాలాల్లో కాత ఆగదు, ఆగినా నిలవదు , పురుగు పట్టేస్తుంది. అదీ దీని ప్రత్యేకత ...!

        అందుకే ఇది మణి కిరీటం అనేది ....! చలో అడవికి పోదాం పదండి ....!




ఇవీ మగ పొదలు మనకు పూతను మాత్రమే  ఇస్తాయ్ ...కాబట్టి ఈజీ గా గుర్తుపట్టచ్చు ! 

ఈ రెండూ పొదలూ ఆడపొదలండోయ్..... పూత,  పూత వెంబడి  కాత అంటే కాయలనిస్తాయ్.... !


సేకరించిన కాయలు ..... వండేయండి మరి......!


పైన  రెండు చిత్రాల్లో మొదటిదాంట్లో పండిన కాయ అలాగే రెండో దాంట్లో పండి పగిలిన కాయని చూడవచ్చు. పగిలిన కాయనుండి రాలిన విత్తనాలు మల్లి మొలకెత్తుతాయి .

  

Comments

  1. చాల బాగున్నాయండి పొటోలు నేను మొదటి సారి ఈ పొదలు చూడటం , వీటిని మేము అరగాకరకాయలంటాం .

    ReplyDelete
  2. ఆడమొక్కలకే కాపు ఉంటుందని విన్నాను. మీరు కొంచెం వ్యతిరేకంగా చెబుతున్నట్టున్నారు.

    ReplyDelete
  3. ఈ బోడ కాకరకాయలు విత్తనాలు దొరుకుతాయ? అవి దుంప మొలకల?

    ReplyDelete
  4. Wow...
    మొదటి సారి చూస్తున్నా బోడకాకర తీగ ని. చాలా థాంక్స్! ఆకాకరకాయలంటే మాకెంత ప్రాణమో.. పెరట్లో పెంచితే అంత నిలవకపోవచ్చుననీ, పురుగుపట్టవచ్చనీ అన్నారు . మరి ఎక్కడ తీసారు ఈ ఫొటోలు?

    ReplyDelete
  5. తాడేపల్లి గారు మీరన్నది నిజమే మల్లి నేను రాసిన విషయాన్ని సరి చూసుకున్నాను. అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ అయ్యింది. దన్యవాదములు.

    ReplyDelete
  6. కృష్ణప్రియ గారు ఇవి ఈ సీజన్ లో మాత్రమే లభిస్తాయి. మరెప్పుడూ కనబడవు.ఐతే పెరట్లో వేసుకోవచ్చు పండిన కాయ నుండి లభిస్తాయి. కాని ఇదే సీజన్ లో కాస్తుంది. మరో సమయం లో కాత రాదు.ఈ సమయం మించి కాసినా పురుగు పట్టుకుంటుంది. ప్రయత్నించండి. ఈ ఫోటోలంటారా మా ఊరి చుట్టూ అడవే ... అటువైపు వెళితే సరి తీగలే తీగలు.
    దన్యవాదములు. ఉంటాను.

    ReplyDelete
  7. శేషుకుమార్ గారు ఈ విత్తనాలు దాని పండు కాయ నుండి లభిస్తాయి. పెరట్లో వేయవచ్చు ... అనుకూలిస్తే మల్లి ఈ సీజన్లో కాపు కాయవచ్చు.

    ReplyDelete
  8. శ్రావ్య గారు మా వైపు వీటిని అలా పిలుస్తారు. ఒకో చోట ఒకో పెరుందేమోనండి. దన్యవాదములు ... మీరంతా మా గ్రామం సందర్శించారు.

    ReplyDelete
  9. ఏమండి మీ కోసం మరి రెండు చిత్రాల్ని జోడించాను. అందులో పండిన కాయ పండి పగిలిన కాయలను చూడవచ్చును.

    ReplyDelete
  10. ఎందుకు కొన్ని పోస్టలకి కామెంట్లు రాయలేకపోతున్నా , "కనపడకుండా పోయిన దొరవారి గడి " అంటే దొర కనపడకుండా ఎటో వెళ్ళారా?
    మీ ఊరు నాకు చాల నచ్చింది .
    అలాగే వీలయితే వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి .

    ReplyDelete
  11. శ్రావ్య గారు ... మా ఊర్లో దొరవారి గడి అంటే వాళ్ళు గతం లో నివసించిన ఇల్లు పేద్ద బంగాళా ను ఈ మధ్య వాళ్ళే వచ్చి మొత్తం కూల్చేసి ... కట్టే వగైరా అమ్మేసుకుని వెళ్లారు.అందుకని " కనపడకుండా పోయిన మన దొరవారి గడి " అన్నాను. WORD VERIFICATION డిఫాల్ట్ గా కొన్ని ఫీచర్స్ ఎనేబుల్ చేయడం వల్ల వస్తోంది. ప్రయత్నిస్తానండి. దన్యవాదములు.

    ReplyDelete
  12. బాగుంది
    నేను మొదటి సారి చూడడమే ఒక సారి తినడానికి ప్రయత్నించాలి ఎలా ఉంటుందో చిరు చేదా ?
    అసలు వీటిని తినొచ్చ ?

    ReplyDelete
  13. యోగేష్ జీ మీరు ఒకసారి తింటే ఇక వదలరు . అదీ దాని డిమాండ్. ఒకసారి ప్రయత్నించండి మరి.....!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.