బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .
అడవి ఒకో ఋతువులో ఒకో అందాన్ని అలంకరించుకుంటుంది. ఈ శిశిరం లో మోదుగు పూల తో మొదలై బూరుగు చెట్టు ఒంటి నిండా బూరుగు పూలతో ఎర్రని రంగు లో అడవి సిగ లో అందమైన పువ్వు లా ఉంటుంది. బూరుగు పువ్వు ను క్రింద చూడండి . సరదా విషయం ఏమంటే .... గ్రామాల్లో పిల్లలు చెరువు కు స్నానానికి వెళితే ...అక్కడి బూరుగు చెట్టు యొక్క ఖాండం పై గల ముళ్ళను తీసుకుని వాటిని టేకు చెట్టు నారలో చుట్టుకుని తాంబూలం లాగా నోట్లో వేసుకుని నములుతారు . కాసేపటికి నోరంతా ఎర్రగా మారుతుంది. భలే హాయిగా ఆడుకుంటూ ఉంటారు. మీరు కూడా వేసుకోండి మరి ...... బూరుగు పువ్వు బూరుగు చెట్టు ఎర్రని బూరుగు పువ్వు అందం.
Mogilipet village is in which district?
ReplyDeleteశ్రీకర్ బాబు గారు నమస్తే ...!
ReplyDeleteమా గ్రామాన్ని సందర్శించినందులకు దన్యవాదములు.
మొగిలిపేట్ గ్రామం కరీంనగర్ జిల్లా మల్లాపూర్ అనే మండలం లో జిల్లా బార్డర్ లో గోదావరి నది వొడ్డున వుంటుందండీ ...!
ధన్యవాద్ ....!