చాలా రోజుల తరువాత సుమారు పది సంవత్సరాల తర్వాత మన చెరువు మత్తడి పై నుండి వరద ప్రవహిస్తోంది. దీని కారణంగా తూం విడవకుండానే చెరు కింద నీటి పార్కం కలిసొచ్చింది.
అడవి ఒకో ఋతువులో ఒకో అందాన్ని అలంకరించుకుంటుంది. ఈ శిశిరం లో మోదుగు పూల తో మొదలై బూరుగు చెట్టు ఒంటి నిండా బూరుగు పూలతో ఎర్రని రంగు లో అడవి సిగ లో అందమైన పువ్వు లా ఉంటుంది. బూరుగు పువ్వు ను క్రింద చూడండి . సరదా విషయం ఏమంటే .... గ్రామాల్లో పిల్లలు చెరువు కు స్నానానికి వెళితే ...అక్కడి బూరుగు చెట్టు యొక్క ఖాండం పై గల ముళ్ళను తీసుకుని వాటిని టేకు చెట్టు నారలో చుట్టుకుని తాంబూలం లాగా నోట్లో వేసుకుని నములుతారు . కాసేపటికి నోరంతా ఎర్రగా మారుతుంది. భలే హాయిగా ఆడుకుంటూ ఉంటారు. మీరు కూడా వేసుకోండి మరి ...... బూరుగు పువ్వు బూరుగు చెట్టు ఎర్రని బూరుగు పువ్వు అందం.
వర్షాలు ఆరంభం కాగానే శ్రావణం లో అలా పొదలపై వాలి కనిపిస్తుంటాయి ఈ కాకరకాయ తీగలు. చూడగానే ముద్దొచ్చే బోడ శరీరం తో ఆకర్షిస్తుంటాయి. సీజనల్ రుచి లో నంబర్ వన్ కాయ గాబట్టే దీనికి డిమాండు ధర అన్నీ ఎక్కువే ...! అడవికి వెళ్తే గాని దొరకదు ,...! ఇంత డిమాండ్ వుంది కదా మనమే ఓ పంటేసి పండిస్తే పోలా ...! అనుకుంటే కుదరదు ఎందుకంటే అన్నీ కాలాల్లో కాత ఆగదు, ఆగినా నిలవదు , పురుగు పట్టేస్తుంది. అదీ దీని ప్రత్యేకత ...! అందుకే ఇది మణి కిరీటం అనేది ....! చలో అడవికి పోదాం పదండి ....! ఇవీ మగ పొదలు మనకు పూతను మాత్రమే ఇస్తాయ్ ...కాబట్టి ఈజీ గా గుర్తుపట్టచ్చు ! ఈ రెండూ పొదలూ ఆడపొదలండోయ్..... పూత, పూత వెంబడి కాత అంటే కాయలనిస్తాయ్.... ! సేకరించిన కాయలు ..... వండేయండి మరి......! పైన...
పసుపు సాగు చేస్తున్న ప్రధాన ప్రాంతాల్లో కరీంనగర్ ,నిజామాబాద్ లు ముఖ్యమైనవి. సంప్రదాయ పద్దతుల్లో పసుపును పెద్ద పెద్ద "కడాయిల్లో " పెద్ద గోతులు తవ్వి ఉడకబెడుతుంటారు. ఈ సీజన్ లో ఊరికి నాలుగు ఐదు చొప్పున పసుపు ఉడకబెట్టడానికి బాయిలర్లు వచ్చాయి. పూర్తిగా ఆవిరి తో ఉడికే పద్దతి కావడం వల్ల తక్కువ కట్టెల తోనే బోలెడు పసుపు ఉడుకుతోంది . రైతులు దాదాపు అందరూ ఈ యంత్ర్రాల ద్వారానే ఉడకేస్తున్నారు . తక్కువ పసుపు దిగుబడి వచ్చిన వాళ్ళు మాత్రం కడాయిల్లో ఉడకేస్తున్నారు . మొత్తానికి అవసరాలు , కాలం తో పాటు మార్పు కళ్ళ ముందే అగుపిస్తోంది....... క్రింద వీడియోలో ఉడకబెట్టే యంత్రాన్ని చూడవచ్చు .
Comments
Post a Comment