స్వర్గీయ శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్ గారు ( కవి - గాయకుడు - నటుడు )
స్వర్గీయ శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్ :
శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్ గారికి జన్మతః సహజాతంగానే రచన, గానం, నటన వచ్చినాయనిపిస్తుంది. వారి వాచకం బాషణం లో ఉట్టిపడే పద విన్యాసం ఎదుటివారిని అలా కట్టి పడేసేవి. ఊర్లో ఆ రోజుల్లో సాగరన్న అంటే తనకు తెలంది లేదు అని జనం చెప్పుకునేవారు. తను ఒక పద్యం, ఒక పాట, ఒక శ్లోకం పాడితే జనమంతా మంత్ర ముగ్దులై వింటూ ఉండేవారు . గ్రామం లో ఎందరో మలి తరం యువకులకు వారి స్పూర్తి గా నిలిచారు. దేశ దేశాల్లో సాగిన వారి జీవన యానం వారిని ఇంకా పరిపక్వం లోకి తెచ్చింది. వారు మస్కట్ లున్న, బొంబాయ్ లున్న ఈ ఊరి మననం చేయనిదే ఉండలేదు. తను మస్కట్ కెళ్ళి ఆడియో క్యాసెట్ నింపి పంపితే వాడంతా వాళ్ళింట్లో వాలి కొన్ని రోజులు వినేవారు. ఆ క్యాసెట్ లో వారు కేవలం ఊరి ఇంటి బాగోగులే గాక అనేక జానపద మాండలీక భాగవత గాధల్ని పాడి పంపేవారు. అదొక పల్లె ఆల్బం గా చెప్పుకోవచ్చు.
అనంతరం వారు ఊర్లో " జ్ఞాన విహార్ శిశుమందిర్ " పేరు తో పాటశాలను నడిపారు. ఆ సమయం లోనే రచానా వ్యాసంగాన్ని తిరిగి ప్రారంభించారు. అందులో భాగంగా నే " భరతపుత్ర శతకం " పేరుతొ ఒక శతకాన్ని రాసారు. అందులో వారు సమకాలీన జీవన విలువల్ని ఆవిష్కరించారు. శతకం ఆసాంతం వారి జీవిత అనుభవాల్ని జీవితసారాన్ని పట్టి ఇస్తుంది.
వారి కాలం లో గ్రామ అభివృద్ధి కోసం " శాస్త్రి యువజన సంఘం " ఏర్పాటయింది. దాని ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించారు. ఎన్నెన్నో గ్రామ అబివృద్ది కార్యక్రమాల్ని చేపట్టారు. వీరి రచన దర్శకత్వం లో "త్రాగుబోతు" అనే నాటికను గ్రామంలో ప్రదర్శించారు.
భరతపుత్ర శతకం
విద్యాసాగర్ గారి భరత పుత్ర శతకం కవర్ పేజి
మచ్చుకు కొన్ని శతకం లోని పద్యాలు :
అన్య భాషలందు ఆత్రుతపెరిగెను
మాతృబాష విలువ మంట గలిసె
మమ్మీ డాడి అనెడి మాడర్న్ పిలుపాయే
భావమెరిగి నడువు! భరత పుత్ర!
అన్నలెవరు భువిని ఆత్మీయులెవ్వరు
కన్నతల్లి లేదు కరుణ లేదు
కాసులున్న చాలు కలిగేరు చుట్టాలు
భావమెరిగి నడువు! భరత పుత్ర!
అప్పు చేయకుండా తప్పు చేయకుండ
భువిని బ్రదుగలేము పొంచిచూడ
అప్పు తప్పు రెండు తప్పక సవరించు
భావమెరిగి నడువు! భరత పుత్ర!
ఇలా వారు ఎన్నో జీవిత సత్యాల్ని పొందుపరిచారు.
Comments
Post a Comment