బతుకమ్మ తయారీ లో చిన్నారులు ... రంగు రంగుల పూల పండగ.

బతుకమ్మ :
                        బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతం లోని మహిళలు, ఆడపిల్లలు జరుపుకునే పండగ. ఆనందంగా ఆడే ఆట - పాట. ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో అనగా శరదృతువు ఆశ్వయుజ మాసం లో వస్తుంది. ఈ పండగనే బొడ్డెమ్మ అని కూడా పిలుస్తారు. పిల్లలు ఆడే ఆట పాట బొడ్డెమ్మ. అలాగే మహిళలు ఆడే పాడే ఆట ను బతుకమ్మ అంటారు. పెత్రమావాస్య రోజు బొడ్డెమ్మ బాయి తోడుకొని  9 లేదా 11 రోజుల వరకు రోజు సాయంత్రం పుట్టమన్ను తో మేగి రంగు రంగు ల పూల తో అలంకరించి ఆ వీధి పిల్లలు పెద్దలు కూడి బతుకమ్మ జానపదాలు పాడుతూ తప్పెట్ల తో అమ్మవారిని కొలుస్తూ చుట్టూ తిరుగుతూ ఆడతారు. 
                         చివరగా తొమ్మిదవ లేదా పదకొండవ రోజు అమ్మలక్కలు రంగు రంగు ల పట్టు చీరలు ,ఒంటి నిండా ఆభరణాలు ధరించి , ఒక పళ్ళెం లో గాని  లేదా తాంబూలం లో  గాని బంతి, గునక, గుమ్మడి, కలువ, అల్లి, కట్లె లాంటి రంగు రంగుల పూలతో అమ్మవారిని అనగా బతుకమ్మను పేర్చి ఉరేగింపుగా గ్రామ వీధులగుండా వెళతారు. మధ్య మధ్యలో చావిళ్ళ వద్ద బతుకమ్మ లను దించి మధ్య లో వుంచి చుట్టూ తిరుగుతూ బతుకమ్మలాడుతారు. 
                        ఈ కోలాహలం లో గ్రామ ప్రజలంతా పాల్గొంటారు. సకుంటుంబంగా అందరూ ఊరేగింపులో ఉంటారు. చివరగా ఊరి బతుకమ్మ లన్నీ గ్రామ చెరువు, వాగు , నది వద్దకు చేరతాయి. అక్కడ అమ్మవారికి చివరి వీడ్కోలు పలుకుతూ చెరువు లో నిమజ్జనం గావిస్తారు. అమ్మవారిని సాగనంపుతూ పోయిరావమ్మ గౌరమ్మ పోయిరావమ్మ ... మళ్ళి వచ్చి మమ్ము ఏలుకోవమ్మ .... అంటూ నీటిలో వదులుతారు .

బతుకమ్మ సద్దులు :
                                  ఈ కార్యక్రమంలో అమ్మవారి నైవేద్యం గా బియ్యం, పెసర, నువ్వులు, పల్లి, మినప, పిండ్లను వేరువేరుగా నెయ్యి లో వేయించి చక్కర కలిపి సద్దులు తయారు చేస్తారు. వీటినే సత్తు పిండ్లు అంటారు.అమ్మవారి నిమజ్జనం తరువాత అదే చెరువు గట్టున పిల్లా పాప సకుటుంబ సమేతంగా సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఆరగిస్తారు. 
                              ఇలా అత్యంత కోలాహలంగా పదకొండు రోజులు సాగే బతుకమ్మ వేడుకలు ఇంటింటా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని నింపుతాయి. అన్ని కష్టాలను మరిచి అందరూ కలిసి మెలిసి వారి ఆనందాన్ని పంచుకుంటారు. పిల్లలకు ఒక మరిచి పోనీ తీపి జ్ఞాపకం. మెట్టినింటున్నా , పుట్టింటున్నా ఎన్నో జ్ఞాపకాలను నెమరు వేసుకునే ఒక సందర్భం బతుకమ్మ . తెలంగాణ ఆడపడుచుల ఆరాధ్య దైవం కొంగు బంగారం అమ్మవారు ...ఆ ఆదిశక్తి. రంగుల హరివిల్లు లా సాగే బతుకమ్మ పండుగ మన అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షిద్దాం

 ఈ సందర్భం లో బతుకమ్మ ను ఎలా తయారు చేస్తారో మా పిల్లల ద్వారా చూడండి. 

                             

Comments

  1. మీ పిల్లలకు తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను పెమ్పొందిస్తున్నందుకు అభినందనలు

    ReplyDelete
  2. ఊరు సౌందర్యాన్ని, తెలంగాణా సంస్కృతి కి చిహ్న మైన బతుకమ్మలను చక్కగా చూపిస్తున్న మీకు
    అభినందనలు.
    మంచి,మనసు,మాట, మర్యాద,మన్నన
    మనిషి ఎదుగు దలకు పనికి వచ్చు,
    చెరుపు జేయు వాడు చేటురా ఊరికి
    మంద వారి మాట,మంచు మూట !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట