పెద్దమ్మ తల్లి - ఊరికి పెద్ద దిక్కు ఆపదల్లో ఆదుకునే అమ్మవారు .

                                                          



"అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో


నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ "


                    హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ వారిని అనేక రూపాల్లో కొలుస్తారు . అందులో ఒక రూపం " పెద్దమ్మ తల్లి ".
                                   మా గ్రామం లో ఊరికి ఉత్తరాన తూరుపుకి అభిముఖంగా అమ్మవారి దేవాలయం ఉంది . ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి " పెద్దమ్మ జాతర "  విశేష కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భం లో అమ్మవారికి , ఆలయానికి నకాయిషి అనే ప్రత్యేక వృత్తి లో వుండే కళాకారులతో రంగులద్దింప జేస్తారు . గ్రామస్తులంతా అమ్మవారి దర్శనం తో పాటు అక్కడే వంటలు చేసుకుంటారు . ప్రత్యేక మొక్కులున్నావారు , నియమిత మొక్కుల వారు వారి వారి మొక్కులను తీర్చుకుంటారు. పెద్దమనుషులు ఊరి బాగు కోరుతూ జంతుబలి చేస్తారు . ప్రతీ సంవత్సరం మిరుగు ( మృగశిర ) అమావాస్య కు పెద్దమ్మ పండుగ పేరు తో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితి .



ఇదీ అమ్మ వారి ఆలయం . పెద్దమ్మ గుడి.




నకాయిషి లచే రంగులద్దబడిన ఆలయ చిత్రాలు.







Comments

  1. నమస్కార్ ...కిరణ్ గారు ! నకాయిషి అనేది తెలంగాణ లో గ్రామస్తుల ఆహ్వానం మేరకు వెళ్లి దేవి దేవతలను, దేవాలయాలను అందంగా అద్దకం చేయడం అంతే పెయింట్ చేసే ... వృత్తి. ఆ పని చేసే వాళ్ళను నకాయిషోల్లు అంటారు. వారు మాత్రమే వంశ పారపర్యంగా వేస్తారు. వారికి దక్షిణ ఉంటుంది. ఎంతో భక్తి ప్రపత్తులతో వారా కార్యాన్ని పూర్తి చేస్తారు. అద్దకం తరువాతే జాతర వగైరా అన్నీ ను ...!
    దన్యవాదములు.

    ReplyDelete
  2. Never heard of them in my village in Khammam Dt.

    Thanks for the info. Could you write a wiki article on http://te.wikipedia.org about them?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట