మొగిలిపేట లో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు - దుర్గాదేవి ఉత్సవ సమితి.

దుర్గానవరాత్రులు :
                             గత ఏడు సంవత్సరాలుగా దుర్గా నవరాత్రి ఉత్సవాలను మొగిలిపేట లో నిర్వహించడం జరుగుతోంది. తొలుత నేతాజీ యూత్ ప్రారంభించినప్పటికీ అనంతరం గ్రామ యువజనుల ఆధ్వర్యం లో ఉత్సవ సమితి గా ఏర్పడి నిర్వహిస్తున్నారు .

అమ్మవారి దీక్షలు :
                                 ఈ సందర్భంగా యువకులు అమ్మవారి దీక్షలు తీసుకుని ఎంతో నిష్ట తో  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు వారు దీక్షలో ఉండి అమ్మవారిని సేవిస్తారు. తొమ్మిది రోజుల్లో అమ్మవారి భోనాలు, కుంకుమ పూజలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పక్కా ప్రణాళిక తో ముందస్తు యోజన తయారు చేసుకుని  అమ్మవారిని నిలబెడతారు. ఆ మేరకు గ్రామ పెద్దలు, ప్రజల నుండి సహకారం లభిస్తోంది. అమ్మవారి ఆభరణాలు, వస్త్రాలు, నైవేద్యం , ఇలా వివిధ విషయాలన్నీ గ్రామం లోని భక్తులు స్వయంగా ముందుకొచ్చి చూసుకుంటున్నారు.

కాలక్షేపం :
                              కాలక్షేపంగా బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పించడం. బుర్రకథలు, హరికథలు , పిల్లలచే నాట్య ప్రదర్శన చేయించడం , ప్రవచనాలు చెప్పించడం జరుగుతోంది.

          గ్రామం మొత్తం లో ఓకే అమ్మవారిని ప్రతిష్టిస్తారు .

అమ్మవారి ప్రతిమ :



అమ్మవారి మండపం :



అమ్మవారి ముందు పూజా యంత్రాలు :







జై  భావాని !   జై జై భావాని !!




Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట