వలసల తో గడిచిపోతున్న లంబాడీ ల జీవనం ... పిల్లలు విద్య కు దూరం .

మా ప్రాంతం లో చెరుకు వాణిజ్యపంట గ రానించడం వల్ల రైతులు అధిక సంఖ్యలోనే చెరుకు పండిస్తారు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యం పేట లో చక్కెర ఫ్యాక్టరీ ఉంది. సమీపం లోని ఎక్కడి రైతు లైనా ఇక్కడికే చెరుకును పంపిస్తారు. ఐతే చేతికొచ్చిన పంటను ఈ సీజన్ లో కత్తిరించి ఫ్యాక్టరీ కి తరలించాల్సి ఉంటుంది. ఇక్కడి రైతులకు చెరుకు నరకడం రాదు. దీని కోసం రైతులు ఆదిలాబాద్ జిల్లా , నిజామాబాద్ జిల్లా ల నుండి లంబాడీలను కుటుంబాలకు కుటుంబాలుగానే గుత్త కు మాట్లాడుకొని తెచ్చుకుంటారు. వారు ఎన్ని క్వింటాళ్ళు నరికారు అనే దాని మీదికేల్లి వాళ్లకు కూలీ కట్టిస్తారు. ఈ విధముగా లంబాడీల ప్రత్యేక...