వలసల తో గడిచిపోతున్న లంబాడీ ల జీవనం ... పిల్లలు విద్య కు దూరం .
మా ప్రాంతం లో చెరుకు వాణిజ్యపంట గ రానించడం వల్ల రైతులు అధిక సంఖ్యలోనే చెరుకు పండిస్తారు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యం పేట లో చక్కెర ఫ్యాక్టరీ ఉంది. సమీపం లోని ఎక్కడి రైతు లైనా ఇక్కడికే చెరుకును పంపిస్తారు.
ఐతే చేతికొచ్చిన పంటను ఈ సీజన్ లో కత్తిరించి ఫ్యాక్టరీ కి తరలించాల్సి ఉంటుంది. ఇక్కడి రైతులకు చెరుకు నరకడం రాదు. దీని కోసం రైతులు ఆదిలాబాద్ జిల్లా , నిజామాబాద్ జిల్లా ల నుండి లంబాడీలను కుటుంబాలకు కుటుంబాలుగానే గుత్త కు మాట్లాడుకొని తెచ్చుకుంటారు. వారు ఎన్ని క్వింటాళ్ళు నరికారు అనే దాని మీదికేల్లి వాళ్లకు కూలీ కట్టిస్తారు.
ఈ విధముగా లంబాడీల ప్రత్యేకత గత కొన్నేళ్ళు గా నడుస్తోంది. వీరు మాత్రమే కత్తిరించగలరు అనేది స్థిరపడింది. ఆ కారణంగా ఈ సీజన్ లో వందలాది లంబాడీ కుటుంబాలు పిల్లా జెల్లా అంతా వారి వారి ఎడ్ల బండ్ల పై ఇక్కడి ప్రాంతం కు రెండు మూడు నెలల కోసం వలస వస్తారు.
చెరుకు తోటల సమీపం లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తారు. లేదా రైతులు ఇచ్చిన కొట్టాల్లో వసతి తీసుకుంటారు . భార్యా భర్త చెరుకు నరకడానికి వెళితే పిల్లలు మాత్రం చదువు సంధ్య లేక గుడిసె ల వద్ద ఆడుతూ కాలం వెల్లదీస్తారు . మొత్తం చెరుకు సీజన్ అయిపోగానే తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు వెళతారు.
ఇదీ వీరి జీవన విధానం. అరకొర చదువులు చాలి చాలని వేతనాలు...... . సాగిపోతున్న వైనం ..... మనవంతు సహకారం తో వారి వికాసానికి తోడ్పడుదాం .

Comments
Post a Comment