గత శనివారం తేదీ 3.9.2011 రోజున చేపల వేట కోసం మరియు పశువులను మేపడానికి తొమ్మిది మంది ఎప్పటి లాగానే గోదావరి కుర్రు ( కుర్రు అంటే మా గ్రామం వద్ద గోదావరి L turn తీసుకుని ఎడమకు మరలి రెండు పాయలుగా చీలి ప్రయాణిస్తుంది ఈ క్రమంలో ఏర్పడిన మధ్య భూ భాగాన్నే కుర్రు అంటాం ) వెళ్లారు .ఇలా జాలరులు , పశువుల కాపరులు రోజూ వెళ్లడం మామూలే కాని .... శనివారం రోజున ఎగువన గల శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ అధికంగా నిండిన కారణంగా 19 గేట్ లను ఒకేసారి ఎత్తివేయడం మూలాన వరద ఉధృతి వేగంయ్యింది . ఉదయం వీరు వేటకు వెళ్లారు సాయంత్రాని కల్లా వరద వేగంగా పెరుగుతూ నీటి మట్టం పెరగడం ప్రారంభమయ్యింది .ఇది గమనించిన ఆ తొమ్మిది మంది లో ఆరుగురు ఈదుతూ క్షేమంగా ఒడ్డు కు చేరారు . ఐతే అగ్గ శేకర్ , ముక్కెర రాజశేకర్ కుర్రు లో చిక్...