మిత్రులారా..... మన దేశం లో 6,00,000 పైన గ్రామాలున్నాయ్ .... ప్రతి గ్రామం కూడా ప్రధానంగా వ్యవసాయ , వివిధ వృత్తుల, ఆధారంగా జీవించేవే... రోజు రోజు కు గ్రామ వికాసం మందగిస్తూ వుంది. ఐనప్పటికీ చిత్రకూట్ లోని పరిసర గ్రామాలు , రాలెగావ్ సిద్ది లాంటి గ్రామాలు అక్కడి ప్రజల స్వయం కృషి , స్వావలంబన కారణంగా సంపూర్ణ వికాస పథంలో వున్నాయి. ఎక్కడైతే వనరుల సద్వినియోగ ఆలోచన సక్రమంగా వుందో అక్కడ చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చిత్తూర్ దగ్గర amaron బ్యాటరీల కంపని స్థానిక ప్రజలకు సాంకేతిక శిక్షణ అందిచి వారి ద్వార అద్భుత పురోగతిని సాధిస్తూ గ్రామ వికాసానికి తోడ్పడుతున్నది. ఇలా విద్యావంతులైన కొందరి ఆలోచన చాలా చోట్ల మంచి ఫలితాల్ని ఇస్తోంది. మరి కొన్ని చోట్ల nri ల భాగస్వామ్యం తో వికాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామీణులు, మాకు దారి చూపండి మేం పని చేసుకుంటాం అంటున్నారు తప్ప మరే ఆర్థిక సహాయాన్ని యాచించటం లేదు . గ్రామీణ యువత కు తగిన ఉపాది మార్గాలు లేని కా...