ఇంటింటా పెళ్ళిసందడి వున్నపుడు లగ్గం కు మొదలు ఇంటి ఇలవేలుపు వంటింటి మా తల్లి కూరాడి కుండ శుద్ధి కోసం ఐదుగురు ముత్తైదువులు డప్పు చప్పుడు తో ఊరి బావి నీళ్ళతో కుండల్లో నీళ్ళు తేసుకెల్లీ ఇంటి పెళ్లి కార్యాన్ని ప్రారంభించడం ఆనవాయితీ....
అడవి ఒకో ఋతువులో ఒకో అందాన్ని అలంకరించుకుంటుంది. ఈ శిశిరం లో మోదుగు పూల తో మొదలై బూరుగు చెట్టు ఒంటి నిండా బూరుగు పూలతో ఎర్రని రంగు లో అడవి సిగ లో అందమైన పువ్వు లా ఉంటుంది. బూరుగు పువ్వు ను క్రింద చూడండి . సరదా విషయం ఏమంటే .... గ్రామాల్లో పిల్లలు చెరువు కు స్నానానికి వెళితే ...అక్కడి బూరుగు చెట్టు యొక్క ఖాండం పై గల ముళ్ళను తీసుకుని వాటిని టేకు చెట్టు నారలో చుట్టుకుని తాంబూలం లాగా నోట్లో వేసుకుని నములుతారు . కాసేపటికి నోరంతా ఎర్రగా మారుతుంది. భలే హాయిగా ఆడుకుంటూ ఉంటారు. మీరు కూడా వేసుకోండి మరి ...... బూరుగు పువ్వు బూరుగు చెట్టు ఎర్రని బూరుగు పువ్వు అందం.
మన కట్ట మీది తాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గౌండ్ల బుచ్చ గౌడు పాతిన మొక్కలు. ఇవి ఇలా పెద్ద గా పెరిగి ఎందరికో ఉపాదినిస్తున్నాయి. తాడి చెట్టు పెట్టినోడు దాన్ని గీయడంటారు. అలాగే జరిగింది వారు ఇప్పుడు లేరు !
ఇంట్లో గాని పెరట్లో గాని ఒక్క టేకు చెట్టు ఉంటె చాలు ఇంట్లో అడవి ఉన్నట్లే తోస్తుంది .చూసే వాళ్లకు అడవిని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. టేకు పూవు, టేకుటాకు, చూడ ముచ్చటగా ఉంటాయి. అడివికి అందాన్ని రాజసాన్ని తెస్తాయి .అందుకే అది కింగ్ ఆఫ్ ఉడ్ .నిలుస్తోంది. మా ఊరి ఆనుకుని ఉన్న అడవి లోని ఫోటోలు ఇవి. ఆస్వాదించండి.
Comments
Post a Comment