తెగిపోయిన మొగిలిపేట చెరువుకట్ట దృశ్యాలు - విషాదం లో రైతులు
మన చెరువు చరిత్ర :
నైజాం కాలం లో నిర్మించిన మొగిలిపేట చెరువు గడిచిన కాలఖండం లో దీంతో మూడు సార్లు ప్రమాదానికి గురైంది . 1940-50 ప్రాంతం లో ఒకసారి ప్రస్తుతం తెగిన ప్రాంతం లోనే తెగిపోగా నాడు గ్రామస్తులంతా కలిసి తిరిగి పూడ్చారు . అనంతరం 1963 ప్రాంతం లో మరో సారి ప్రస్తుతం తూం వున్న ప్రాంతం లో కట్ట తెగిపోగా అప్పటి దొర మలహళ్ రావ్ సూచన తో అతని కొడుకు ప్రస్తుత మెట్పల్లి ఖాది గ్రామోద్యోగ ప్రతిష్టాన్ చైర్మన్ తూం ను భిగించి తెగిన కట్ట ను పునరుద్దరించారు .
అప్పటికే మత్తడి వుండేది .... కాని అది 1983 ప్రాంతం లో షట్టర్ లతో సహా కొట్టుకు పోవడం తో ఆనాటి సర్పంచ్ నడిపి దొర సుధాకర్ రావ్ దానిని తిరిగి షట్టర్లు లేకుండా నిర్మించారు . ఆ సమయం లో శాస్త్రి యువజన సంఘ సభ్యులు మత్తడి నిర్మాణం లో సహకరించారు.
ప్రస్తుతం మంగలి గండి వద్ద కట్ట తెగిపోయింది . ఈ ప్రదేశం లో గత ఐదారేండ్ల నుండి చిన్న నీటి జల తో చెరువు నుండి బయటకు నీరు వస్తోంది . ఐతే దాన్ని మనం అలానే చూస్తూ వచ్చాం . అదికాస్త గత రెండు నెలల క్రితం గండి పడడం తో మరమ్మతులు చేశాం . ఆ విషయం ఈ బ్లాగ్ లో ప్రకటించడం జరిగింది . గత మూడు రోజుల వర్షం కారణంగా విపరీతమైన వరద వచ్చి చేరడం తో మంగలి గండి వద్ద కట్ట బలహీన పడసాగింది . దీంతో నీటి ఒత్తిడి అధిక మవడం వలన తట్టుకోలేని కట్ట ఉదయం 5 గంటల ప్రాంతం లో తెగిపోయింది . ఇలా తెగిపోవడం దీంతో మూడవసారి అవుతుంది .
జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టాన్ని కలిగించింన వర్షం :
అప్పటికప్పుడు ఈ బ్లాగ్ టీం తీసిన చిత్రాలు :
తెగిన కట్ట ను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడుతున్న స్థానిక MLA శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్ గారు :
తీవ్ర నష్టం :
తీవ్ర స్థాయి వరద కారణంగా చెరువు క్రింది అనేక పొలాలు తోటలు సుమారు 300 ఎకరాల్లో తీరని నష్టం జరిగింది. భూమి కోతకు గురి కావడం తో కొన్ని భూములు శాశ్వతంగా పనికిరాకుండా పోయాయి. లక్షల డబ్బు ఖర్చు చేసి గత వేసవి లో బావులు తవ్వి మోటర్లు బిగిన్చుకున్నారు ఒక్కొక్కరికి నాలుగైదు మోటర్లు వున్నాయి . అవి ఈ ఉదృతి కి కొట్టుకు పోయాయి . ఒక్కో రైతు లక్షల రూపాయలు కోల్పోయి తీవ్ర దుఖం లో వున్నారు .

రైతు మిట్టపెల్లి బాపురెడ్డి తదితరులతో వివరాలు అడిగి తెలుసుకొంటున్న MLA
గ్రామ సర్పంచ్ కొడుకు వెంకట్రెడ్డి , మోహన్ రెడ్డి తదితరులతో MLA
MLA తో పాటు సందర్శించిన ZPTC మల్లాపూర్ జలపతి రెడ్డి మరియు మత్స్యకారులు .
కట్ట తెగిన దృశ్యాలు
తీవ్ర స్థాయి వరద కారణంగా చెరువు క్రింది అనేక పొలాలు తోటలు సుమారు 300 ఎకరాల్లో తీరని నష్టం జరిగింది. భూమి కోతకు గురి కావడం తో కొన్ని భూములు శాశ్వతంగా పనికిరాకుండా పోయాయి. లక్షల డబ్బు ఖర్చు చేసి గత వేసవి లో బావులు తవ్వి మోటర్లు బిగిన్చుకున్నారు ఒక్కొక్కరికి నాలుగైదు మోటర్లు వున్నాయి . అవి ఈ ఉదృతి కి కొట్టుకు పోయాయి . ఒక్కో రైతు లక్షల రూపాయలు కోల్పోయి తీవ్ర దుఖం లో వున్నారు .
అయ్యో
ReplyDeletevery sad to hear
ReplyDelete