ఊర ఓశవ్వ ( ఊరి లోని పోశవ్వ ) ఊరి ని కనిపెట్టుకుని కటాక్షించే తల్లి - పోశవ్వ తల్లి.

                                భారతదేశం లో ప్రతీ గ్రామం లో ఆ గ్రామస్తుల నమ్మకాలు , పరిస్థితులు , వారు ఎదుర్కున్న వివిధ కష్ట నష్టాలు , బాధలు , విపత్తులు , సుఖ దుఃఖాల నేపథ్యం లో గ్రామదేవతల ప్రతిష్ట జరుగుతుంది . ప్రతిష్ట జరిగిన దేవతలకు వారి కట్టుబాట్లు , ఆచారాల మేరకు ప్రతీ ఏడు క్రమం తప్పకుండా పండగల , జాతరల నిర్వహణలు జరుగుతాయి . అలా తెలంగాణ ప్రాంతం లో ప్రతీ గ్రామం లో పోశవ్వ , మైశవ్వ , మహంకాళి పేర్లతో ఆదిశక్తి రూపాలుగా గ్రామ దేవతలు కొలువై వున్నాయి.
                                 ఇంటి కార్యమైన , గ్రామ కార్యమైనా ముందు ఊర ఒషవ్వకు తెలపాల్సిందే ..! ఆ మేరకు మొక్కు పూర్తయ్యాకే కార్యక్రమం లో ముందుకు వెళ్లడం జరుగుతుంది.

                                 అలా మా గ్రామం మొగిలిపేట లో కొలువై ఉన్న ఊర ఓషవ్వ , సార్గమ్మ , పోతలింగన్న లను చూడవచ్చు.




తిర్మల్ హోటల్ ముందు నాటి నుండి తన తమ్ముడు పోతలింగన్న రక్షణలో కొలువై ఉన్న పోశవ్వ తల్లి.



దొరగారి యాప దగ్గర కొలువై ఉన్న పోశవ్వ  .


సార్గమ్మ తల్లి .

                                     గ్రామం లో ప్రతీ మాఘం అమావాస్య తర్వాతి గురు ,ఆది వారాల్లో  గ్రామం లోని ప్రతీ ఒక్కరు చలి బోనాలు  అమ్మవారికి సమర్పించు కోవడం ఆనవాయితీ .
                                            
                                    చలి బోనం అంటే గురు ,ఆది వారాలకు ఒక రోజు ముందు రాత్రి స్నానం ఆచరించి కుండలో కేవలం తెల్ల అన్నం వండి అలాగే ఉదయం వరకు ఉంచుతారు దీన్నే " చలి బోనం " అంటారు . మళ్ళి తెల్లవారి తలంటు స్నానం చేసి నాలుగు ఇత్తడి పాత్రల్లో వేరు వేరు గా బెల్లం అన్నం ( బెల్లపన్నం ) వండి మొత్తం మా గ్రామం లో ఉన్న ఐదు పోశవ్వ లకు నైవేద్యం గా సమర్పించడం జరుగుతుంది. ఇలా సమర్పించడాన్నే చలిబోనం అంటారు . ఈ బోనాలు క్రమం తప్పకుండా గ్రామం లో గ్రామ క్షేమం కోరి మొక్కు గా తీర్చుకుంటారు .
               
                                    అలాగే ఏ ఇంట్లో నైనా పెళ్లి జరిగితే పిల్ల లేదా పిలగాని పెళ్లి బట్టల్ని ఒక రోజు ముందు ఊర్లే పోషవ్వలకు చప్పుడు తో వెళ్లి చూయించుకొని వస్తారు. దీనికి ముందు ఒక ఆదివారం లగ్గం ముందు పోశవ్వ పండుగ చేయడం తప్పని సరి ....! ఇలా పోశవ్వ తల్లి గ్రామీణుల తో పెనవేసుకున్న ఆత్మీయ బంధం . అన్నింటికీ అమ్మవారే దిక్కు .

      త్వరలో మన బ్లాగ్ లో మన గ్రామం లో ఉన్న ఐదుగురు పోశవ్వల గురించి ప్రత్యేక వ్యాసం ఉంటుంది . 
  1. నల్ల ఒషవ్వ   ( కట్టకింద )
  2. బంగారి పోశవ్వ   ( ఆనబండల తోవ ల మఱ్ఱి తొర్ర లో గల అమ్మవారు  )
  3. ముత్యాల పోశవ్వ  ( ఆనబండల కొంగ సాకలోల్ల తోటల )
  4. ఆడెల్లి పోశవ్వ    ( అటే గూండ్లోల్ల తోటల )
  5. మాలక్ష్మమ్మ    ( తూం కాడ మామిడి బాగుల )
            ఇదీ మన గ్రామం లోని గ్రామ లోని పోశావ్వల కథ .








Comments

  1. "congratulations" .you did the good job. you are saluting to your village in a pride manner .Thanks for the introduction of your village.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

తాటి చెట్టు - తాటి మట్ట