ఘనంగా జరిగిన పెద్దమ్మ తల్లి జాతర - మళ్లీ ఐదేళ్లకు పునర్దర్శనం
మా గ్రామం లో ప్రతీ ఐదేళ్లకు ఒక సారి పెద్దమ్మ తల్లి జాతర జరుగుతుంది . సుమారుగా తెలంగాణా గ్రామా లన్నింటిలో ఇలాగే ఆనవాయితీ ఉంది . గ్రామ కుల సంఘాల సమితి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరుగుతుంది. తేదీ 8.5.2011 ఆదివారం రోజున జాతర జరిగింది . అమ్మ వారిని రంగులతో అద్దడానికి గ్రామ శివారుల్లో ఒక పందిరి వేసి అక్కడికి తీసుకెళతారు. ఈ సారి కోటకాల్వ మామిండ్ల లో అద్దకం కార్యక్రమం ఏర్పాటు చేశారు . అద్దకాని కి వారసత్వంగా పని చేసే నకాయిషీ లు రంగులు అద్దుతారు . అద్దకం పూర్తీ అయ్యాక గ్రామస్తులంతా వెళ్లి అమ్మవారిని ఘనంగా దేవాలయానికి ఎదుర్కొంటారు . ఇట్టి కార్యక్రమం లో " ద్యావతి " వాండ్ల విన్యాసాలు గ్రామస్తులను బాగా ఆకర్షిస్తాయి . కాని ఈ సారి అంత చెప్పుకోదగ్గ విన్యాసాలు ఏమి ప్రదర్శించ లేకపోయారు . ఎదుర్కోలు సమయం లో కోళ్ళ మేడలు విరిచి పాడేయడం, కోడి గ్రుడ్లను తింపి విసరడం ...వల్ల అమ్మ వారి కోపం చల్లారుతుందని విశ్వసిస్తారు. మహిళలు దారి పొడుగునా మంగళ హారతులతో స్వాగతం చెపుతూ కొబ్బరికాయలు కొడతారు . ఈ విధంగా అమ్మవారి ఉరేగింపు సాగుతుంది. అమ్మ వారి పండుగ చేయడం వల్ల గ్...